Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ పెద్దాయనకు గోమాంసం గోలెందుకో!!

By:  Tupaki Desk   |   31 Oct 2015 11:11 AM GMT
ఇన్ఫోసిస్ పెద్దాయనకు గోమాంసం గోలెందుకో!!
X
దేశంలో గోమాంసం రగడ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. సంబంధం ఉన్నవారు లేనివారు అంతా దీనిపై మాట్లాడుతూ ఆ మంట ఆరకుండా చేస్తున్నారు. కొద్దిరోజులు ఎవరూ పట్టించుకోకుండా ఉంటే దానికదే సమసిపోవాల్సిన ఈ ఇష్యూను కోతి పుండులా బ్రహ్మరాక్షసిని చేస్తున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించేవారు... తమ అభిప్రాయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారే. సొంత వ్యవహారాలు.. అవినీతి అక్రమాలు... చిలక్కొట్టుడులపై విలేకరులు ఎంత గుచ్చిగుచ్చి ప్రశ్నలేసినా ''నో కామెంట్" అని తప్పించుకునే నేతలు, సెలబ్రిటీలు కూడా ఇప్పుడు మైకు దొరికితే చాలు గోమాంసంపై మాట్లాడేస్తున్నారు. దీనిపై ఒక్కరు కూడా ''నో కామెంట్'' అనడం లేదు. ఏ వ్యవహారమైనా రచ్చగా మారుతుంటే దాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నిస్తే తప్పేముంది. కానీ అలా జరగడం లేదు. తాజాగా ఇన్ఫోసిస్ పెద్దాయన నారాయణ మూర్తి కూడా గోమాంసం ఇష్యూపై మాట్లాడేశారు. హాయిగా సాఫ్టువేర్ లు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండక క్లీన్ ఇమేజి ఉన్న ఆయనకెందుకో ఇది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రీసెంటుగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నారాయణమూర్తి దేశంలో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని... వారిలో భయాందోళనలు ఉన్నాయంటూ గోమాంస అంశాన్నీ పరోక్షంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. మతాలు, ప్రాంతాల మధ్య సామరస్యం ఉండాలన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఇండైరెక్టుగా విసుర్లు విసిరారు. అప్పుడే నారాయణమూర్తి వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలనుంచి విమర్శలు మొదలయ్యాయి.