Begin typing your search above and press return to search.
ఇన్ఫోసిస్ ఒళ్లు బలుపు మామూలుగా లేదుగా? అందరూ గళమెత్తాల్సిందే
By: Tupaki Desk | 29 April 2022 5:24 AM GMTమీరు షాపులో పని చేస్తున్నారు. మీరు పడే కష్టానికి తగ్గ జీతం ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? ఆ షాపులో పని మానేసి.. మరో షాపులో పనికి చేరతారు. అలా చేస్తే.. పాత యజమాని కొత్త పంచాయితీ పెడుతూ.. తన షాపులో పని చేసే గుమస్తా మరో షాపులో చేరాలంటే ఒప్పుకోమని.. ఉద్యోగం మానేసిన ఏడాది తర్వాత షాపులో చేరమంటే? ఇలాంటి దరిద్రపుగొట్టు రూల్ గురించి విన్నంతనే ఒళ్లు మండిపోదు. దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తీరు ఇప్పుడు ఇలానే ఉంది. ఈ సంస్థ ఒళ్లు బలుపుతనం గురించి తాజాగా వస్తున్న వార్తల్ని వింటుంటే ఒళ్లు మండిపోవాల్సిందే.
రాజీనామా చేసిన తమ సంస్థ ఉద్యోగులు తమకు పోటీగా ఉన్న సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగం చేయకూడదంటూ ఇన్ఫోసిస్ విధించిన రూల్ చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో.. అప్పుడెప్పుడో నాటు పద్దతిలో.. భూస్వామ్య విధానంలో ఉండే రూల్ ను ఇప్పుడు పెట్టటమే కాదు.. దీనికి సంబంధించిన వివాదంలో చర్చించేందుకు సైతం ముందుకు రాని తీరు చూస్తే.. ఇదేం బలుపురా బాబు? అనుకోకుండా ఉండలేం.
పోటీ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ నచ్చుతుందన్నది వారి ఇష్టం. ఉద్యోగులకు తమ సంస్థలో పని చేయాలన్న భావన కలిగేలా కంపెనీలు చేసుకోవాలి. అంతేతప్పించి.. ఉద్యోగుల్ని బానిసల మాదిరి.. తక్కువ జీతాలతో తమ వద్దే పని చేయాలని అదిలించటం.. ఒకవేళ కంపెనీ మారతానంటే దరిద్రపుగొట్టు రూల్ పెట్టి.. వారికి కెరీర్ లేకుండా చేయటం చూసినప్పుడు.. ఈ రోజున ఇన్ఫోసిస్ తెచ్చిన రూల్ ను రేపొద్దున మిగిలిన టెక్ కంపెనీలు అందిపుచ్చుకుంటే.. నయా బానిసత్వం టెక్ ప్రపంచంలో మొదలైనట్లే.
ఇన్ఫోసిస్ నిబంధనపై ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో.. ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. ఆ సంస్థ మధ్య తలెత్తిన విభేదాల్ని పరిష్కరించేందుకు ఏప్రిల్ 28న కేంద్ర కార్మిక శాఖలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఉద్యోగ ప్రతినిధులతో పాటు.. ఇన్ఫోసిస్ ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంది. అయితే.. సమావేశానికి మొదట వస్తానని చెప్పి.. చివర్లో పత్తా లేకుండా పోవటం గమనార్హం. ‘‘ఆఫీసుకు రాకపోతే రాకపోయారు.. కనీసం జూమ్ కాల్ లో అయినా మాట్లాడదాం’’ అంటూ కార్మిక శాఖ అధికారులు కోరినా ఇన్ఫోసిస్ ఉద్యోగులు మాత్రం ససేమిరా అనటం గమనార్హం.
దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్.. ఈ తరహా రూల్ పెట్టటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇది నయా బానిసత్వమని.. ఇలాంటి నిబంధనను కంపెనీలు పెట్టటం మొదలైతే.. ఉద్యోగులకు శాపంగా మారటమే కాదు.. వారి ప్రయోజనాలు భారీగా దెబ్బ తినటం ఖాయమంటున్నారు. అయినా.. వ్యాపారం చేసేటోడు ఎవరైనా.. ఉద్యోగుల్ని అదిలించి.. బెదిరించి పని చేయించుకునే కన్నా.. నమక్మంతో ప్రేమతో పని చేయించుకుంటేనే ప్రయోజనం.. ఫలితం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీ ఎలా మిస్ అయినట్లు?