Begin typing your search above and press return to search.
20వేల కొత్త ఉద్యోగాలు ఇస్తామంటున్న ఇన్ఫోసిస్
By: Tupaki Desk | 3 Jun 2017 4:57 AM GMTఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్న దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తాజాగా తీపికబురుతో మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది సిబ్బందిని నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. పనితీరు సరిగా లేని వారిని ప్రతియేటా తొలగించడంలోభాగంగా గతేడాది 400 మందిపై వేటు వేసినప్పటికీ ఈ ఏడాది 20 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు ప్రకటించారు.
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో సమావేశమైన అనంతరం సీవోవో ప్రవీణ్ రావు విలేకరులతో మాట్లాడుతూ సరైన పనితీరు కనబరుచని ఉద్యోగులను ప్రతియేటా 300-400 మందిని తొలగిస్తున్నట్లు చెప్పారు. దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతుల సంస్థయైన ఇన్ఫోసిస్..మరిన్ని ఉద్యోగాలను సృష్టించనున్నదని తెలిపారు. ఈ సమావేశానికి ఇన్ఫోసిస్ సహ-చైర్మన్ రవి వెంకటేసన్ కూడా హాజరయ్యారు. సీనియర్ ఉద్యోగాలు జీతాలు తగ్గించుకోని, జూనియర్ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యాలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. గడిచిన మూడేళ్లలో 2.5 లక్షల మందిని నియమించుకున్న టీసీఎస్..ఈ ఏడాది మరో 20 వేల మందికి కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/