Begin typing your search above and press return to search.
టెక్కీలకి గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్ .. ఏమిటంటే !
By: Tupaki Desk | 21 Aug 2020 6:45 AM GMTకరోనా నుండి అన్ని రంగాలు ఎప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాయి. నిరుద్యోగిత రేటు క్రమగా తగ్గుతూవస్తుంది. జూన్‌లో దాదాపు 40 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింతే, జూలైలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. లాక్ డౌన్ సమయంలో 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 10 శాతం దిగువకు చేరుకుంటోంది. ఇది ఆర్థిక కార్యకలాపాలు, దీని ద్వారా జాబ్ మార్కెట్ కొంత కోలుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, ఐటీ రంగంలో, అందులోను టాప్ 5 సంస్థల్లోనే ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది చాలా కంపెనీలు వేతనాలు, ప్రమోషన్లు పక్కన పెట్టాయి. కొన్ని కంపెనీలు వీటిని అమలు చేస్తున్నాయి. తాజాగా దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
గ్లోబల్ కస్టమర్ల నుండి భారీ ఒప్పందాలు సాధిస్తున్న ఈ ఐటీ దిగ్గజం సెప్టెంబర్ నాటికి అర్హత కలిగిన జూనియర్, మధ్యస్థాయి సిబ్బందికి పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీలో దాదాపు 2.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌లో వేతనాల పెంపు, ప్రమోషన్లు నిలిచిపోయాయి. వచ్చే నెల నుండి దీనికి సంబంధించి ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు 90శాతానికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ప్రస్తుతం కొత్త ఒప్పందాలు దక్కించుకుంది. దీంతో ఈ ఆర్థికసంవత్సరంలో కొంత వృద్ధిని అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా పలు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ జాబ్ లెవల్ ఫైవ్ నుండి అంతకు కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని చూస్తుంది.
సెప్టెంబర్ 2020 ప్రమోషన్, శాలరీ హైక్‌లో ఇన్ఫోసిస్ లో సగానికి పైగా ప్రమోషన్‌కు అర్హులు అని తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 1.20 లక్షల మంది అర్హులు. కంపెన్షేషన్ రివిజన్లు తాము హోల్డ్ లో పెట్టామని, అయితే కొన్ని ప్రమోషన్లు, ఈ క్వార్టర్ లో ప్రారంభించనున్నామని, ఎక్కడ వెకెన్సీ ఉందో అక్కడ వీటిని పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగ్నిజెంట్, క్యాప్ జెమినీలు గ్లోబల్ కంపెనీలు. ఇప్పటికే ఈ కంపెనీలు ప్రమోషన్లు ఆఫర్ చేశాయి. అయితే భారత్ కు చెందిన ఐటీ కంపెనీల్లో మొట్టమొదట ప్రమోమషన్లు, శాలరీ హైక్ ఆఫర్ చేస్తోంది ఇన్ఫోసిస్ మాత్రమే.