Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు కోల్పోయిన మ‌రో వెయ్యి ఉద్యోగాలు

By:  Tupaki Desk   |   21 Sep 2018 1:23 PM GMT
మ‌నోళ్లు కోల్పోయిన మ‌రో వెయ్యి ఉద్యోగాలు
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల పుణ్యాన టెకీల‌కు నిద్ర క‌రువు అయ్యేలా చేసే ఎన్నో ఆదేశాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించారు. ఇదే స‌మ‌యంలో ఆ దేశంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న మ‌న‌దేశానికి చెందిన కంపెనీలు సైతం ఆయా నిర్ణ‌యాలు అనుస‌రిస్తున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు తమ సంస్థలో 5,874 మంది యూఎస్‌ పౌరులను నియమించుకున్నట్లు ప్రకటించిన రెండురోజుల త‌ర్వాత మ‌రో వెయ్యి మందిని త్వ‌ర‌లో నియ‌మించుకోనున్న‌ట్లు వెల్ల‌డించింది.

మారిన విధానాల ప్ర‌కారం 10,000 మంది అమెరికన్లను నియమించుకుంటున్నట్లు కిందటి ఏడాదిలోనే ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే భారీగా నియ‌మ‌కాలు చేసింది. తాజాగా కృత్రిమ మేధ (ఏఐ) - మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) - క్లౌడ్ - బిగ్‌ డేటా - డిజిటల్‌ టెక్నాలజీస్ - యూజర్‌ అనుభవం - డిజిటల్‌ టెక్నాలజీల్లో సేవ‌ల భాగంగా తాజాగా మ‌రో వెయ్యి మందిని తీసుకునేందుకు సిద్ధ‌మైంది. అరిజోనా రాష్ట్రంలోని అవ‌స‌రాల రీత్యా ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ప్ర‌భావం హెచ్‌1బీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్లే వారిపై ప‌డుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

కాగా, నైపుణ్యం ఉన్న స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని ట్రంప్ పిలుపు ఇవ్వ‌డంతో ఇప్పుడు కాగ్నిజెంట్ స్థానికుల‌నే ఎంపిక చేసేందుకు సిద్ధ‌మైంది. అమెరిక‌న్ల‌కు ఎక్కువ ఉద్యోగాలు క‌ల్పించి - హెచ్‌1బీ వీసాల‌ను త‌గ్గించాల‌ని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ అధ్య‌క్షుడు రాజీవ్ మెహ‌తా కొద్దికాలం క్రితం ప్ర‌క‌టించారు. గ‌త ఏడాదితో పోలిస్తే - ఈసారి సగం మందికే వీసా ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు మెహ‌తా చెప్పారు.