Begin typing your search above and press return to search.
మీడియా కథనంలో ఇన్ఫోసిస్ కు దెబ్బ పడింది
By: Tupaki Desk | 9 Jun 2017 9:11 AM GMTమీడియాలో వార్త వస్తే ఏంది? అంటూ రాజకీయనాయకులు తరచూ మాట్లాడటం మామూలే. రాజకీయంగా జరిగే నష్టం ఏమిటన్నది పక్కన పెడితే.. వ్యాపార రంగానికి మాత్రం మీడియాలో వచ్చే ఒక్క ప్రతికూల కథనం కావొచ్చు.. దారుణంగా దెబ్బ పడటానికి. ఒక కథనం.. ప్రముఖ కంపెనీ మీద ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. ఉన్నట్లుండి అంత భారీగా పడటానికి కారణం లేకపోలేదు. ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో ప్రచురితమైన కథనం ఇన్ఫోసిస్ షేర్ ను భారీగా పడేలా చేసిందని చెప్పాలి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో నెలకొన్న విభేదాల కారణంగా.. కంపెనీ సహ వ్యవస్థాపకులు తమ వాటాల్ని అమ్మేస్తున్నారంటూ ఒక కథనాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించింది.
దీంతో.. ఇన్ఫోసిస్ షేర్ ధర మీద భారీ ప్రభావం పడింది. దాదాపు రూ.28 వేల కోట్లు విలువ చేసే 12.75 శాతం వాటాను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుటుంబం వద్దనే ఎక్కువ స్టేక్ ఉంది) తమ వాటాను అమ్మేయాలని భావిస్తున్నట్లుగా సదరు కథనం ప్రచురించింది.
దీంతో.. శుక్రవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ షేర్ ధర పడిపోవటం మొదలైంది. తాజా కథనం నేపథ్యంలో షేర్ ధర మీద తీవ్ర ప్రభావం చూపించిందని చెబుతున్నారు. దీంతో.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి స్పందించారు. సహ వ్యవస్థాపకులు తమ షేర్లను అమ్ముతారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని.. అమ్మకం వార్తలు తప్పుగా ఖండించారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా స్పందించారు. తమపై కథనం అచ్చేసిన ఆంగ్ల పత్రికకు ఈమొయిల్ రూపంలో సమాధానం పంపారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు తీసుకునే నిర్ణయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. అందుకు కంపెనీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఏమైనా.. ఒక వార్తా కథనం ఒక పెద్ద కంపెనీని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇన్ఫోసిస్ తాజా ఉదంతం చూస్తే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/