Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ కు రూ.565 కోట్లు ఫైన్ వేసిన కాలిఫోర్నియా సర్కార్

By:  Tupaki Desk   |   18 Dec 2019 6:43 AM GMT
ఇన్ఫోసిస్ కు రూ.565 కోట్లు ఫైన్ వేసిన కాలిఫోర్నియా సర్కార్
X
భారత ఐటీ దిగ్గజ కంపెనీ ల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కు భారీ షాక్ తగిలిందా? ప్రతిష్ఠాత్మకమైన ఆ కంపెనీ చిల్లర పనికి పాల్పడిందా? అదే కంపెనీకి చెందిన ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడా కంపెనీ పేరుప్రఖ్యాతులు బద్నాం కావటమే కాదు.. ఏకంగా రూ.565 కోట్ల భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే?

ఇన్ఫోసిస్ కు కాలిఫోర్నియా ప్రభుత్వం భారీ జరిమానాను విధించింది. వీసా నిబందనల్ని ఉల్లంఘించినందుకు.. పన్ను అవకతవకలకు పాల్పడినందుకు 8లక్షల డాలర్లు.. మన రూపాయిల్లో చెప్పాలంటే 565 కోట్లు జరిమానా విధించినట్లుగా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ వెల్లడించారు. 2006 నుంచి 2017 మధ్య కాలంలో 500 మంది ఉద్యోగుల్ని ఇన్ఫోసిస్ హెచ్ 1బీ వీసాకు బదులుగా బీ1 వీసాలపై కాలిఫోర్నియా కు పంపింది.

దీంతో.. వీసా నిబంధనల్ని ఉల్లంఘించినట్లైంది. హెచ్1బీ వీసాల మీద పరిమితి ఉండటం.. ఆ వీసాలపై వచ్చే ఉద్యోగులకు అక్కడి ప్రమాణాల ప్రకారం వేతనాల్ని చెల్లించాల్సి రావటంతో అందుకు బదులుగా బీ1 వీసాలపై ఉద్యోగుల్ని తరలించింది. కంపెనీ చేస్తున్న మోసాన్ని ఆ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి ఒకరు బయటపెట్టారు. దీంతో అమెరికా ప్రభుత్వం విచారణ జరిపి.. ఇన్ఫోసిస్ తప్పు చేసినట్లు తేల్చారు. తన తప్పు బయట పడటంతో ఇన్ఫోసిస్ బుద్ధిగా తనకు విధించిన జరిమానాను కట్టేందుకు ఓకే చెప్పింది. తప్పు చేయటం ఎందుకు? దొరికపోయి ఫైన్ కట్టటం ఎందుకు? అయినా.. ఈ చిల్లర చేష్టలేంది?