Begin typing your search above and press return to search.

8,042 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం: భూమిపూజ చేసిన ఏపీ సీఎం జగన్

By:  Tupaki Desk   |   25 Dec 2021 10:31 AM GMT
8,042 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం: భూమిపూజ చేసిన ఏపీ సీఎం జగన్
X
ఏపీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మెగా టౌన్ షిప్ ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, రిటైల్ యూనిట్ కు భూమి పూజ చేశారు. ఈ మెగా టౌన్ షిప్ లో రూ. 110 కోట్లతో 8,042 గృహాలను నిర్మించనున్నారు. 323 ఎకరాల్లో నిర్మించే ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఇప్పటికే లబ్ధిదారులకు అందించినట్లు జగన్ తెలిపారు.ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.

అలాగే రూ. 147 కోట్లతో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఇక పులివెందుల కేంద్రంగా రూ.2.60 కోట్లతో నిర్మించిన ఆక్వాహబ్ ను ప్రారంభించారు. ఇక్కడ చేపలు, రొయ్యలు విక్రయించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కలలో కూడా అనుకోలేదని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లా పట్టాలిచ్చాం. వీరికి పక్కా ఇళ్లు కట్టిస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఇల్ల స్థలం రూ. 2లక్షలు, ఇంటి నిర్మాణం రూ.1.80 లక్షలు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు రూ.2 లక్షలు ఇలా ప్రతి పేద కుటుంబానికి రూ. 6 లక్షల స్థిరాస్థిని అందిస్తున్నాం.

ఈ స్థిరాస్థి రెండేళ్ల తరువాత రూ.10 లక్షలవుతుంది. పేదల అభివృద్ధి కోసమే వైసీపీ పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు. ఇక రూ.4.70 కోటలతో చీనీ శీతల గిడ్డంగులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

పులివెందుల అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలమంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.5,036 కోట్లతో చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ -నీవా ఎత్తి పోతల పథకం జూన్లోగా పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నో కంపెనీలో ఇంట్రెస్టు చూపుతున్నాయన్నారు. ఇందులో భాగంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా యూనిట్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు.

ఇక్కడ ఆ కంపెనీకి చెందిన యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నందుకు సంస్థ ఎండీ అశీశ్ దీక్షిత్ కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే అపెరల్ విస్కోస్ ఫిలమెంట్ యూర్న్ లో దేశంలోనే ప్రముఖ సంస్థలో ఆదిత్య బిర్లా ఒకటని, 2019లో రూ.8,700 కోట్లు టర్నోవర్ కలిగిన సంస్థ పులివెందులలో యూనిట్ పెట్టడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఈ కంపెనీ ద్వారా 2,112 మందిరి ఉపాధి లభించనుందని, ఇందులో 85 శాతం మహిళలకేనని తెలిపారు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 3031 ఫ్యాషన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయని, 25 వేల మల్టీ బ్రాండ్ దుకాణాలు, 6,500 డిపార్ట్ మెంట్స్ స్టోర్స్ ను నడపుతోందన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన అపాచీ షూ కంపెనీ ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.

మరోవైపు పులివెందులలో రూ.500 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ ప్రభుత్వ కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 500 పడకల ఈ మెడికల్ కాలేజీ 2023 డిసెంబ్ నాటికి అందుబాటులోకి రానుంది. ఇడుపుల పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు, గండి వీరాంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు గడువులోగా పూర్తి కానునన్ాయి.

ఇక రూ. 480 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు 2022 జూన్ నాటికి, రూ. 5,036 కోట్లతో పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఆయకట్టును స్థిరీకరించేందుకు జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుంచి ఎత్తి పోతల పథకం పనులు 2023 లోగా పూర్తి కానున్నాయి.