Begin typing your search above and press return to search.

అమ్మ పేరు మీద పార్టీనే పెట్టేశారు

By:  Tupaki Desk   |   26 Dec 2016 8:03 AM GMT
అమ్మ పేరు మీద పార్టీనే పెట్టేశారు
X
‘అమ్మ’ పిలుపును బ్రాండ్ గా మార్చేసి.. తన అసలు పేరును మర్చిపోయేలా చేశారు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. సంక్షేమ పథకాలకు అమ్మ పేరు పెట్టిన ఆమె.. బడుగు ప్రజల్ని విశేషంగా ఆకర్షించారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం అనంతరం.. ఆమె పార్టీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నసమాచారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మకున్నక్రేజ్ ను మరింత క్యాష్ చేసుకోవాలనుకున్నారో.. అధికార అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పులు తేవాలని భావించారోకానీ.. తమిళనాట అమ్మ పేరు మీద కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

ద్రావిడ ఇయక్కంలో ఒకప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్ కుమారుడు ఇనియన్ సంపత్ తాజాగా అమ్మ డీఎంకే పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అన్నాడీఎంకేను ఇంగ్లిషులో జాతీయ స్థాయిలో ‘‘ఏఐడీఎంకే’’గా వ్యవహరిస్తే.. తమిళనాట మాత్రం.. ‘‘ఏడీఎంకే’’గా వ్యవహరిస్తారు. తాజాగా పెట్టిన కొత్త పార్టీ అమ్మ డీఎంకే కావటంతో.. దీన్ని ఇంగ్లిషులో ‘‘ఏడీఎంకే’’ అని వ్యవహరించే పరిస్థితి.

తాజా పరిణామాల నేపథ్యంలో పేరులో గందరగోళాన్ని పుట్టించేలా పార్టీ పుట్టుకొచ్చింది. అమ్మ పేరుతో పెట్టిన ఈ పార్టీ జెండాలో జయలలిత విక్టరీ సంకేతాన్ని చిహ్నాంగా ఏర్పాటు చేసి.. తన ఇంటి మీద ఎగురవేశారు. తాజా పరిణామం అన్నాడీఎంకే నేతలు.. కార్యకర్తల్లో విపరీతమైన కన్ఫ్యూజన్ కు గురి చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/