Begin typing your search above and press return to search.
ఇంజెక్షన్ మర్డర్ లో మిస్టరీ వీడింది.. అందుకే చంపేశారు
By: Tupaki Desk | 21 Sep 2022 5:30 PM GMTదారిన పోయే దానయ్య లిప్టు అడిగాడని బైక్ ఆపి.. ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. ఎవరైనా లిఫ్టు అడిగితే ఆలోచించే పరిస్థితికి వచ్చిన దుస్థితి. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిస్టరీ దాదాపుగా వీడినట్లేనని చెబుతున్నారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా చెబుతున్నారు. ఈ మర్డర్ లో ముగ్గురికి భాగస్వామ్యం ఉందని.. అందులో ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా ముదిగొండలో కలకలం రేపిన విషపు ఇంజెక్షన్ మర్డర్ విషయంలో ప్రమేయం ఉన్న ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ అయితే.. ఇంకొకరు ఆర్ఎంపీ డాక్టర్ గా.. మరొకరు ట్రాక్టర్ డ్రైవర్ గా గుర్తించినట్లు సమాచారం. లిఫ్టు అడిగినట్లే అడిగి.. తాము టార్గెట్ చేసిన వ్యక్తిని విషపు ఇంజెక్షన్ ను తొడ మీద గుచ్చటం ద్వారా చంపేసిన వైనం ముదిగొండ మండలం వల్లభి - బాణాపురం గ్రామాల మధ్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రాణాలు పోగొట్టుకున్న 48 ఏళ్ల షేక్ జమాల్ సాహెబ్ సుతారీ మేస్త్రీగా జీవిస్తుంటాడు.
సోమవారం ఉదయం ఖమ్మం జిల్లాకు సరిహద్దున ఉన్న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలోని తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వారి ఊరికి బయలుదేరాడు.
దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మాస్కు ధరించి లిఫ్టు అడగటం.. సాయం చేద్దామని బైక్ ఆపి.. వాహనం ఎక్కించుకుంటే.. సదరు వ్యక్తి కాస్త దూరం వెళ్లిన తర్వాత.. జమాల్ సాహెబ్ తొంటి భాగంలో ఇంజక్షన్ పొడవటంతో ఒక్కసారి షాక్ తిన్న అతను.. బైక్ వేగాన్ని తగ్గించాడు. అప్పటికే మరో బైక్ మీద ఇంకో వ్యక్తి వచ్చేయటంతో ఆ బైక్ మీద వెళ్లిపోయారు.
కాస్త దూరం వెళ్లినంతనే జమాల్ సాహెబ్ కు కళ్లు తిరగటం.. విపరీతంగా దాహం వేయటంతో దారి పక్కనే ఉన్న తిరుపతిరావు వద్ద మంచినీళ్లు అడిగాడు. తనను గుర్తు తెలియని వ్యక్తి లిఫ్టు అడిగి.. తన తొంటి భాగంలో ఇంజెక్షన్ గుచ్చిన వైనాన్ని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తిరుపతి రావు తన స్నేహితుడైన శివ అనే వ్యక్తి సాయాన్ని తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రధమ చికిత్స చేస్తున్న సమయంలోనే జమాల్ సాహెబ్ మరణించాడు.
ఈ సంచలన హత్య వెనుక వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ముగ్గురిలో ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే పోలీసులు ఈ మర్డర్ వెనుకున్న అసలు నిజాల్ని అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.