Begin typing your search above and press return to search.
నోటి నుంచి రక్తం; వణికిస్తున్నసూదిపోటు
By: Tupaki Desk | 10 Sep 2015 6:40 AM GMTసూదిగాడిని అర్జెంట్ గా పోలీసులు పట్టుకోవాల్సిన అవసరం వచ్చేసింది. నిన్నటి వరకూ ఉన్న భయాందోళనలు నేడు నిజమని తేలింది. రెండు వారాల క్రితం సూదిగాడి చేతిలో సూదిపోటు పడ్డ మహిళ ఆరోగ్యం క్షీణించటంతో పాటు.. ఇప్పుడు విషమంగా మారింది.
సూదిపోటు పడిన రెండు వారాలకు కానీ సూదిమందు ఎఫెక్ట్ చూపించటం మొదలైంది. రెండు వారాల కిందట పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో చంటి అనే మహిళ రోడ్డు మీద వెళుతున్న సమయంలో బైకు మీద వేగంగా వచ్చిన సూదిగాడు వెనుక నుంచి పొడిచేసి వెళ్లిపోయాడు. భయంతో ఆమె వైద్యుల్ని కలవటం వారు ఎలాంటి భయం అక్కర్లేదని ధైర్యం చెప్పి పంపారు.
కానీ.. రెండు వారాలు గడిచిన తర్వాత ఆమె ఆరోగ్యం నెమ్మదినెమ్మదిగా క్షీణించటం.. బుధవారం ఆమె ముక్కు.. నోటి నుంచి రక్తం కారటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాజా ఉదంతంతో చంటితో పాటు.. మిగిలిన సూదిపోటుకు గురి అయిన వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే చంద్రబాబు సర్కారు.. సూదిపోటుకు గురైన వారికి ప్రత్యేక వైద్యసౌకర్యాలు చేయించాల్సిన అవసరం ఉంది. ఇంతకీ సూదిగాడు అసలేం గుచ్చాడన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది.