Begin typing your search above and press return to search.
యాదాద్రి సాక్షిగా 'పాపం'.. తలా పిరికెడు..!
By: Tupaki Desk | 8 Dec 2022 6:31 AM GMTసాక్ష్యత్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువు దీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో వ్యభిచార ముఠాలు రాజ్యమేలుతుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. చిన్నతనంలోనే అమ్మాయిలను కొనుగోలు చేస్తూ వారికి బాయిలర్ కోళ్ళ మాదిరిగా ఇంజెక్షన్లు ఇస్తూ వ్యభిచార రొంపిలోకి లాగుతున్నారనే విషయం తాజాగా వెలుగు చూసింది.
యాదాద్రిలో గత కొన్నాళ్లుగా వ్యభిచార కార్యకలాపాలు పోలీసులు అండతోనే సాగాయనే వాదనలు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక యాదాద్రిని తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తరుచూ యాదాద్రికి వెళుతూ అక్కడి పనులను పర్యవేక్షిస్తూ వచ్చారు. దీంతో గత ఐదేళ్లో యాదాద్రిలో వ్యభిచార దందా తగ్గుముఖం పట్టింది.
యాదాద్రి పై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఆ ప్రాంతంలో వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని పోలీసులు.. అధికారులు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. 110 కుటుంబాలు వ్యభిచారం మీద ఆధాపడి జీవిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరిలో ఉన్నత చదువుకున్న మహిళలు ఉపాధి అవకాశాలు చూసుకోగా మరికొందరు కొండ కింద దుకాణాలు.. హోటళ్లు నిర్వహిస్తూ.. ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరిలో 70శాతం మందికి మెరుగైన జీవితాన్ని సాగిస్తుండగా 30శాతం మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంలో అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది. మరోవైపు యాదాద్రి ఆలయ పనులు పూర్తి కావడంతో సీఎం.. ఉన్నతాధికారుల రాకపోకలు తగ్గిపోయాయి. ఇదే అదనుగా వ్యభిచార ముఠా సభ్యులు మహిళల బలహీనతను ఆసరా చేసుకొని వ్యభిచార దందాను మళ్లీ షూరు చేస్తున్నారు. వీరికి పోలీసులు సైతం అండగా నిలుస్తున్నారనే విమర్శలు సైతం వ్యక్తమవుతోంది.
తాజాగా ఇద్దరు బాలికలను ముఠా సభ్యులు వ్యభిచార రొంపిలోకి దింపుతుండగా ఒక బాలిక తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఈక్రమంలోనే పోలీసులు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీసుల విచారణలో ఇద్దరు బాలికలను చిన్నతనంలోనే ముఠా సభ్యులు కొనుగోలు చేశారని.. ప్రస్తుతం 16 ఏళ్ల లోపు ఉన్న వీరిని వ్యభిచారంలోకి దింపుతుండగా ఒక అమ్మాయి ముఠా నుంచి తప్పించుకొని పోలీసులను సమాచారం అందించింది.
పక్కా సమాచారం ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే యాదాద్రి ఖ్యాతి దృష్ట్యా ఇక్కడి పోలీస్ స్టేషన్ ను ఏసీపీ స్థాయికి పెంచారు. ఇక ఇన్స్ పెక్టర్.. నలుగురు ఎస్సైలు.. 70మంది పోలీసులు నిత్యం విధులు నిర్వరిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో ఒక బాలిక వచ్చి పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరే దాకా ఈ విషయం వారికి తెలియదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పోలీసుల అండతోనే ఈ వ్యవహారం నడుస్తుందనే విమర్శలు సైతం వెల్లువెత్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇందులో వాస్తవం లేదని.. గతంలో వ్యభిచారంలో పట్టుబడిన ముఠా సభ్యులపై పీడీ యాక్టులు నమోదు చేశామని గుర్తు చేస్తున్నారు. వ్యభిచార రొంపిలోకి దించుతున్న వారిని తామే బయటకు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే యాదాద్రి సాక్షిగా వ్యభిచార ‘పాపం’ మాత్రం తలా పిరికెడు అన్న చందంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.