Begin typing your search above and press return to search.
సైకో సూదిగాడు @ 20
By: Tupaki Desk | 6 Sep 2015 3:02 PM GMTవాడు ఎవడో తెలియదు..ఎక్కడుంటాడో తెలియదు...ఎలా ఉంటాడో తెలియదు..వాడు ఒక్కడేనా..ఇద్దరా..లేదా ఓ ముఠా ఉందా అన్నది కూడా తెలియదు. పదిరోజులుగా ఉభయగోదావరి జిల్లా ప్రజలతో పాటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. మహిళలతో స్టార్ట్ చేసి తర్వాత ఆటో డ్రైవర్ ఇలా ఎవరికి పడితే వారికి ఓ ఇంజెక్షన్ గుచ్చిపడేస్తున్నాడు. చివరకు వాడి పేరు సైకో సూదిగాడిగా మారిపోయింది.
గత నెల చివరి వారంలో ప్రారంభమైన ఈ దాడుల పరంపర ఇంకా ఆగలేదు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం మరో మహిళపై దాడితో ఈ సైకో సూదిగాడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచడంతో రెండు రోజులుగా వీడి అలజడి లేకుండా పోయింది. ఆదివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం గ్రామం వద్ద జరిగిన ఘటనలో ఒక మహిళ ఈ తరహా దాడి కి గురి అయింది. ఓ వ్యక్తి ఆకస్మికంగా వచ్చి ఆమెకు సిరంజీ గుచ్చి పారిపోయాడు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
ఈ దాడితో ఉభయగోదావరి జిల్లాల్లో ఈ సైకో సూదిగాడి బాధితుల సంఖ్య 20కు చేరుకుంది. ఇక తెలంగాణలో మల్కాజ్‌గిరిలో కూడా నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి ఓ ఆగంతకుడు సిరంజీ గుచ్చి పారిపోయిన సంగతి తెలిసందే. ఇంతకు ఈ సైకో ఒకడా, లేక పలువురు ఉన్నారా అన్నది కూడా ఇంకా పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. ఈ సైకో గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఏపీ డీజీపీ జేవీ రాముడు ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడి జరిగింది. ఒక రోజు సిరంజీ సైకో దొరికాడని ప్రచారం జరిగినా అది వాస్తవం కాలేదు. పైగా హైదరాబాద్ లో కూడా సిరంజీ సైకో కలకలం రేపాడు. ఈ సైకోకు ఎక్కువ ప్రచారం చేస్తే ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఉందని రాముడు హెచ్చరించారు.