Begin typing your search above and press return to search.

షర్మిల చేతి గాయాన్ని చెక్ చేసి షాకింగ్ నిజాన్ని చెప్పిన వైద్యుడు

By:  Tupaki Desk   |   16 April 2021 3:31 AM GMT
షర్మిల చేతి గాయాన్ని చెక్ చేసి షాకింగ్ నిజాన్ని చెప్పిన వైద్యుడు
X
యువతకు ఉద్యోగాల కోసం ఒక రోజు ధర్నా చేసిన వైఎస్ షర్మిల.. అనూహ్యంగా పాదయాత్రను చేపట్టటం.. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద జరిగిన తోపులాటలో ఆమె బట్టలు చినిగాయి. చేతికి బలమైన గాయమైంది. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించటం.. పెనుగులాడిన క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయారు.

అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను.. లోటస్ పాండ్ వద్ద విడిచిపెట్టారు. అనంతరం ఆమె దీక్షను చేపట్టారు. ఆమె చేతికి గాయమైన నేపథ్యంలో వైద్యులు ఒకరు వచ్చి..షర్మిలకు పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు వారాల పాటు చేతిని కదపకూడదన్నారు. ‘చేతికి మూడు రోజులు బ్యాండేజ్ ఉండాల్సి ఉంటుంది. ఎవరో కర్రతో బాగా బలంగా కొట్టారు. వెరీ స్ట్రాంగ్ హిట్ అన్న మాట’ అని పేర్కొన్నారు. తోపులాట జరిగిన వేళ.. షర్మిల చేతి మీద బలంగా కర్రతో ఎవరు కొట్టి ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. సునీల్ నాయక్ ఆత్మహత్య తనను కదిలించిందని.. అందుకే దీక్ష చేస్తున్నట్లుగా చెప్పారు షర్మిల. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. తనకు దీక్ష చేసుకునే అనుమతే ఇవ్వకుంటే.. ఇంట్లో చేస్తానని.. అప్పుడు రెండు రోజులు కాదు.. అంతకంటే ఎక్కువ రోజులు చేస్తానని.. పచ్చి మంచినీళ్లు కూడా తాగనని చెప్పారు.