Begin typing your search above and press return to search.
డ్రీమ్ సిటీకి అన్యాయం జరుగుతోంది...?
By: Tupaki Desk | 31 March 2022 3:30 PM GMTడ్రీమ్ సిటీ జగన్ కి ఏపీలో ఒకటి ఉంది. ఆ సిటీ పేరే విశాఖపట్నం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాయక విశాఖ పేరును ఎన్నో సార్లు తలచారు. నాడు చంద్రబాబు అమరావతి జపం చేస్తే జగన్ మాత్రం విశాఖ అంటూ ఊరించారు. విశాఖను పాలనా రాజధాని చేస్తామని అన్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ అంతా విశాఖను అల్లుకునే ఉంది.
జగన్ సైతం విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ అన్నారు. సినీ రాజధానిగా చేస్తామని చెప్పారు. అలాంటి విశాఖ కొత్త జిల్లాల ఏర్పాటుతో చాలా చిన్న అయిపోయింది. ఒక విధంగా పాత రూపం, నిండు రూపం కోల్పోయి చిన్న బోయింది. ఒకనాడు విశాఖ ఏపీలో పెద్ద జిల్లాగా ఉండేది.
అలాంటి విశాఖను మూడు జిల్లాలుగా చేశారు. దాంతో విశాఖ నుంచి అనకాపల్లి వేరు పడిపోయింది. ఏజెన్సీ కాస్తా అల్లూరి జిల్లా అయింది. మరి ఈ మొత్తం మార్పు చేర్పులలో విశాఖ మరీ కురచ అయిపోయింది. విశాఖ అంటే కేవలం ఆరు అసెంబ్లీ సీట్లతో ఏపీలోనే చిన్న జిల్లాలో మొదటి వరసకు వచ్చింది. కనీసం రూరల్ ఏరియా లేదు, అభివృద్ధికి భూమి లేదు,
పెందుర్తిని, ఎస్ కోటను కలపని కోరినా దీనికి సంబంధించి వందల లెక్కన వినతులు వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మొత్తానికి విశాఖను అలాగే ఉంచేశారు. దాంతో ఆ ప్రభావం అభివృద్ధి తో పాటు, రాజకీయంగా కూడా పడనుంది. కొత్త జిల్లాలను బేస్ చేసుకుని మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్నారు.
విశాఖలో చూసుకుంటే ఆరు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు తెలుగుదేశమే గెలుచుకుంది. ఇక మిగిలిన రెండింటిలో భీమిలీ ఒకటి, గాజువాక ఒకటి. భీమిలీ నుంచి తొలి విడతలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఇక విస్తరణలో న్యాయంగా మంత్రి పదవి దక్కాలీ అంటే పవన్ని ఓడించిన గాజువాక ఎమ్మెల్యేకు ఇవ్వాలి. కానీ అక్కడ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయి.
ఆయన రెడ్డి సామాజికవర్గం కావడంతో అసలు చాన్సే లేకుండా పోతోంది. ఇక విశాఖ నుంచి ఎమ్మెల్సీగా నెగ్గిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, ఆయనకు గ్యారంటీగా మంత్రి పదవి అనుకుంటే అది కూడా సామాజిక సమీకరణలతో పోతోంది అంటున్నారు. వేరే జిల్లాలలో యాదవ సామాజికవర్గానికి అకామిడేట్ చేయడంతో వంశీకి మొండి చేయి చూపిస్తారు అని తెలుస్తోంది.
పైగా వంశీ కొన్ని నెలల క్రితమే ఎమ్మెల్సీ కావడం, ఆయనకు అనుభవం తక్కువ అన్న కారణాలు కూడా చూపుతున్నారు. మొత్తానికి చూస్తే విశాఖకు ఇంతటి విస్తరణలో మంత్రి పదవి ఏదీ ఇవ్వకపోవచ్చు అని ఇప్పటికైతే వినిపిస్తున్న మాట. అదే నిజం అయితే జగన్ డ్రీమ్ సిటీకి నిండా అన్యాయమే జరిగింది అనుకోవాలి.
పాలనా రాజధాని కాస్తా చిన్నదైపోయింది. ఇపుడు మంత్రి కూడా లేకపోతే ఎలా అన్న చర్చ కూడా వస్తోంది. మరి జిల్లాల విభజనతో విశాఖ మీద వైసీపీ కక్ష కట్టిందని ఇప్పటికే కామెంట్స్ చేస్తున్న విపక్షాలు మంత్రి పదవి విశాఖకు ఇవ్వకపోతే మరింతగా అధికార పార్టీ మీద విమర్శలు చేసే అవకాశం ఉంది.