Begin typing your search above and press return to search.
ఏపీకి అన్యాయం జరిగింది.. జగన్ ఆవేదన
By: Tupaki Desk | 1 Nov 2020 9:30 AM GMTఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా తనలో గూడుకట్టుకున్న ఆవేదనను వెళ్లగక్కారు. రాజధాని కూడా లేని అనాథగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు.
నవంబర్ 1. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవరం సందర్భంగా దేశంలోనే ఏపీకి అన్యాయం జరిగిందని వాపోయారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీ చరిత్రలోనే మన అంతగా దగా పడిన రాష్ట్ర దేశంలో మరొకటి లేదని’ వాపోయారు. బయటి వారి కత్తిపోట్లు, సొంతవారి వెన్ను పోట్లతో ఏపీ నష్టపోయిందన్నారు.
ఏపీలో ఇప్పటికే 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్థితిగతులను మెరుగుపరుస్తూ.. గ్రామాల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
17 నెలలుగా ఏపీలో వివక్ష లేని అవినీతి లేకుండా పాలన అందిస్తున్నానని.. ఏపీని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యం అని జగన్ అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి.మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు.