Begin typing your search above and press return to search.

దేశం లోనే తొలిసారి హైదరాబాద్ లో..పోలీస్ కంప్లైంట్ అలానూ ఇవ్వొచ్చు

By:  Tupaki Desk   |   6 Jan 2020 5:59 AM GMT
దేశం లోనే తొలిసారి హైదరాబాద్ లో..పోలీస్ కంప్లైంట్ అలానూ ఇవ్వొచ్చు
X
ఏదైనా సమస్య వచ్చినప్పుడు... ఇబ్బంది ఎదురైనప్పుడు.. తమ గోడు తెలియజేయాలంటే పోలీస్ స్టేషన్ కు బాధితులు వెళ్లాలి. అక్కడ ఫిర్యాదు చేయాలి. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నం గా దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలంటే అందుకు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని ప్రజలకు సరికొత్త విధానాన్ని షురూ చేశారు.

ఈ విధానం లో కంప్లైంట్ స్టేషన్ కు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తమ ప్రాంతానికి వచ్చే పెట్రో కార్.. అదేనండి గస్తీ కోసం వివిధ ప్రాంతాల్లో తిరిగే పెట్రోలింగ్ మొబైల్ వాహనం లో ఉండే సిబ్బంది కి ఇస్తే సరిపోతుంది. సదరు ఫిర్యాదు ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ జారీ చేస్తారు. ఇలాంటి విధానం దేశం లో మరెక్కడా లేదని.. తొలిసారి హైదరాబాద్ నగరంలో స్టార్ట్ చేస్తున్నట్లు గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్పేర్కొన్నారు.

సాధారణంగా పోలీసులకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే తప్పని సరిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సింది. ఫిర్యాదు ఇచ్చే సమయంలో రైటర్ కానీ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ అందుబాటులో లేకుంటే వారొచ్చే వరకూ ఎదురుచూడాల్సి వచ్చేది. అందుకు భిన్నంగా కొత్త విధానంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేదు. తాముంటున్న వీధి లోకి వచ్చే పెట్రో కారులోని సిబ్బందికి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఘటనా స్థలానికి తొలుత చేరుకునేది పెట్రో కార్.. బ్లూకోల్ట్స్ సిబ్బంది మాత్రమే. వారికే ఫిర్యాదు ఇచ్చేస్తే సరి పోతుంది.