Begin typing your search above and press return to search.
మీరాబాయి ఐనాక్స్ బంపర్ ఆఫర్... ఏమిటంటే ?
By: Tupaki Desk | 29 July 2021 6:12 AM GMTమీరాబాయి చాను .. ఈ పేరుకి ప్రస్తుతం దేశంలో పరిచయం అక్కర్లేదు. దేశంలో ఆమె పేరు మారుమ్రోగుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఈ పతకాన్ని సాధించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ లో పతకం కోసం గత 21 సంవత్సరాలుగా భారతదేశం ఎదురు చూస్తోంది. ఒలింపిక్స్ లో రెండో రోజే మీరాబాయి చాను పతకం సాధించడంతో భారత తన ఖాతాను తెరిచింది.
పతకం సాధించడంతో సోషల్ మీడియాలో ఆమెను అభినందిస్తూ..పోస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పలు బహుమతులను ప్రకటిస్తున్నాయి. రైల్వే శాఖ 2 కోట్లు, మణిపూర్ ప్రభుత్వం కోటి క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించాయి. ఇక ఆ మధ్య తనకు పిజ్జా అంటే ఇష్టమని ఆమె చెప్పగానే.. నీకు లైఫ్ టైమ్ ఫ్రీగా పిజ్జాలు ఇస్తామని డొమినోస్ ప్రకటించింది. గతంలో పిజ్జాను చాలాకాలంగా తినలేదని, ఇది తినాలని కోరుకుంటున్నట్లు మీరాబాయి చాను వెల్లడించారు. దీంతో పతకం గెలిచిన వెంటనే డొమినోస్ ఇండియా ఆ నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఓ మల్టీప్లెక్స్ చెయిన్ మీరాబాయికి జీవితకాలం ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తామని ప్రకటించింది. ఆమె ఎన్ని సినిమాలు చూసినా అన్నీ ఫ్రీ అంటూ చెప్పింది ఐనాక్స్ లీజర్ లిమిటెడ్. మీరాబాయికే కాదు.. ఈ ఒలింపిక్స్ లో మెడల్ తో ఇంటికి వచ్చే ప్రతి భారత అథ్లెట్ కు ఇదే ఆఫర్ వర్తిస్తుందని ఐనాక్స్ స్పష్టం చేసింది. ఇక ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన ప్రతి అథ్లెట్ కు ఏడాదిపాటు ఫ్రీగా టికెట్లు ఇస్తామనీ వెల్లడించింది. దేశంలో ఐనాక్స్ కు మొత్తం 648 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఈ విషయాన్ని తన ట్విటర్ లో ఐనాక్స్ తెలిపింది.
తన ప్రదర్శన పట్ల చాను ట్విట్టర్ లో స్పందించింది. తన కల నిజమైనట్టుగా ఉందంది. ఈ రజత పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నానని తెలిపింది. ఈ పోటీల్లో స్వర్ణం సాధించేందుకు చివరి వరకు ప్రయత్నించానని, కానీ రజత పతకం కూడా విలువైనదేనని చాను చెప్పింది. ఐదేళ్ల తన కృషి ఫలించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. తాను కేవలం మణిపూర్ అమ్మాయిని కాదని, యావత్ భారతావనికి చెందుతానని మీరాబాయి చాను అంది. తన ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించింది. ముఖ్యంగా తన తల్లికి రుణపడి ఉంటానని, ఆమె తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడింది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ క్రీడల చరిత్రలో రెండవ పతకాన్ని మీరాబాయి చాను భారత్‌కు ఇచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి మాత్రం మీరాబాయే. ఈ ఏడాది ఫస్ట్ ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది చాను.