Begin typing your search above and press return to search.
ఆ మల్టీఫ్లెక్సుల్లో క్రికెట్ మ్యాచ్ లు!
By: Tupaki Desk | 28 May 2019 4:49 AM GMTక్రికెట్ ప్రేమికులకు శుభవార్త. క్రికెట్ ను ఒక మతంగా ఫీలయ్యే మన దేశంలో.. తాజా ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా అంతులేని వినోదాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దేశంలో అతి ఎక్కువ మల్టీఫ్లెక్సులు ఉన్న ఐనాక్స్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరో రెండు రోజుల్లో (మే 30న) ప్రారంభమయ్యే ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్ లలో కొన్నింటిని తన మల్టీఫ్లెక్సుల్లో ప్రదర్శించేందుకు సిద్ధమైంది.
మే 30న షురూ అయ్యే ప్రపంచ కప్ షెడ్యూల్ నేపథ్యంలో ఎంపిక చేసిన మ్యాచులను మల్టీఫ్లెక్సుల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టీమిండియా తలపడే తొమ్మిది మ్యాచ్ లతో పాటు.. సెమీఫైనల్స్.. ఫైనల్ తో సహా మొత్తం 15 కీలక మ్యాచులను ఐనాక్స్ మల్టీఫ్లెక్సుల్లో ప్రసారం చేయనున్నారు. ఈ సదవకాశం ముంబయి.. ఢిల్లీ.. కోల్ కతా.. బెంగళూరు.. ఫుణె.. జైపూర్.. ఇండోర్.. వడోదర.. సూరత్.. నోయిడా.. గుర్గావ్.. ఫరీదాబాద్ లోని భారీ తెరల మీద క్రికెట్ వినోదాన్ని పంచటానికి సిద్ధమైంది ఐనాక్స్.
వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా తమ మల్టీఫ్లెక్సులు క్రికెట్ స్టేడియంలుగా మారనున్నట్లుగా ఐనాక్స్ చెబుతోంది. నేరుగా స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్ చూస్తే.. ఎలాంటి అనుభూతి కలుగుతుందో.. అలాంటి అనుభవాన్నే తమ మల్టీఫ్లెక్సుల్లో మ్యాచుల ద్వారా పొందొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐనాక్స్ అనుకోవటం సరే.. మరి క్రికెట్ అభిమానులు మరెలా రియాక్ట్ అవుతారో చూడాలి.