Begin typing your search above and press return to search.
కరోనా వేళ.. టీ20 వరల్డ్ కప్ ను వాడేయనున్న ఐనాక్స్
By: Tupaki Desk | 16 Oct 2021 3:40 AM GMTకరోనా కారణంగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో వినోద పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే.. నేటికీ ఇంకా కోలుకున్నది లేదు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేసి కొద్ది నెలలు అవుతున్నా.. భారీ సినిమాలు ఇప్పటికి విడుదల కాని పరిస్థితి. దీనికి కారణం.. ప్రేక్షకులు థియుటర్లకు వచ్చేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకపోవటమే. అయితే.. ఇప్పటికే మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలు.. ఒక మోస్తరు సినిమాలు మాత్రమే విడుదల అవుతున్నాయి.
దీనికి తోడు.. ఇంట్లోకి ఓటీటీ కంటెంట్ వచ్చేసిన నేపథ్యంలో.. అంతకు మించి అన్న సినిమా వచ్చి.. థియేటర్లోనే చూడాలన్న సినిమాల కోసం పలువురు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో.. థియేటర్లు పూర్తిస్థాయిలో నిండక కిందా మీదా పడుతున్నాయి. ఇలాంటివేళ వచ్చిన టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఐనాక్స్ థియేటర్లు అద్భుతమైన ఐడియా వేసింది.
క్రికెట్ మ్యాచ్ ను.. బుల్లిటీవీల్లోచూసే దానికి బదులుగా.. థియేటర్లో సిల్వర్ స్క్రీన్ మీద.. చూస్తూ ఉండటానికి మించిన మజా ఏముంటుంది? అది కూడా తోటి క్రికెట్ అభిమానులతో కలిసి చూసే ఈ మ్యాచ్ లు థియేటర్లో చూస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుందని చెప్పటంతో సందేహం లేదు. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ కు భారత్ వేదిక కావాల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో వీటిని యూఏఈ.. ఒమన్ లో నిర్వహిస్తున్నారు.
ఈ మెగా టోర్నీని భారత్ ఆడే మ్యాచుల్ని ఐనాక్స్ థియేటర్లలో ప్రదర్శించటానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించింది. ఈ నెల 17న ప్రారంభమయ్యే ఈ పొట్టి మెగా టోర్నీ నవంబరు 14 వరకు సాగనుంది. థియేటర్లో మ్యాచ్ ను చూస్తే.. స్టేడియంలో చూసిన ఫీల్ ఖాయమన్న మాటను ఐనాక్స్ చెబుతోంది. మ్యాచ్ ను ఐనాక్స్ థియేటర్లలో చూడటానికి దేశంలోని వివిధ నగరాల్లో వేర్వేరు ధరలు ఉంటాయని చెబుతున్నారు.
కనిష్ఠంగా రూ.200 మొదలు రూ.500 వరకు ఉంటాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఐనాక్స్ కు 70 నగరాల్లో 56 మల్టీఫ్లెక్సుల్లో 658 స్క్రీన్లు ఉన్నాయి. మ్యాచ్ సందర్భంగా థియేటర్లను ఫుల్ కెపాసిటీలో నింపుకోవచ్చని.. అదే సమయంలో స్నాక్స్ కు భారీగా ఆర్డర్లు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి సరైన సినిమాలు విడుదల కాని వేళ.. టీ20 వరల్డ్ కప్ టోర్నీని తనకు తగ్గట్లు మార్చుకోవటంలో ఐనాక్స్ అదిరే ఐడియా వేసిందని చెప్పక తప్పదు.