Begin typing your search above and press return to search.
పురచ్చితలైవి మృతి.. విచారణ కమిటీ గడువు 3 నెలల నుంచి 59 నెలలకు పెరగడానికి కారణమిదే!
By: Tupaki Desk | 24 Oct 2022 9:24 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పురచ్చితలైవి (విప్లవ నాయకి) మరణంపై తమిళనాడు ప్రభుత్వం గతంలో నియమించిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు మొదట్లో మూడు నెలలు మాత్రమే గడువు ఇచ్చారు. మొదట 13 మందిని విచారిస్తే సరిపోతుందనుకున్నారు. అయితే తవ్వేకొద్దీ ఈ కేసులో అనేక విషయాలు బయటపడుతుండటంతో మూడు నెలల గడువు కాస్తా 59 నెలలకు పెరిగింది. 2017లో జయలలిత మృతిపై విచారణ కమిటీ ఏర్పడగా 2022లో ఆగస్టులో కమిషన్ నివేదిక ఇచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మరణించినట్లుగా అధికారికంగా 2016 డిసెంబరు 5న వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం, అన్నాడీఎంకే మీద ఆధిపత్యం కోసం జయ నెచ్చెలి శశికళ, జయ నమ్మినబంటు పన్నీరు సెల్వం మధ్య విభేదాలు పొడసూపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమ్మ జయలలిత మృతిపై తనకు అనుమానాలున్నాయని పన్నీరు సెల్వం బాంబుపేల్చడం, ఇదే విషయాన్ని తమిళ ప్రజలు నమ్మడంతో నాటి పళనిస్వామి ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్‌ను విచారణకు నియమించిన సంగతి తెలిసిందే. 2017 సెప్టెంబరు 27న కమిషన్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
జస్టిస్ ఆర్ముగస్వామి విచారణలో తవ్వేకొద్దీ అనేక విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్‌రావు, ప్రభుత్వ వైద్యులను విచారించే క్రమంలో విచారించాల్సినవారు ఇంకా చాలామంది ఉన్నారని కమిషన్‌కు అర్థమైంది.
జయలలితకు అందిన వైద్యం విషయంలో శశికళతో పాటు అపోలో ఆసుపత్రికి మాత్రమే అవగాహన ఉందని కమిషన్ విచారణలో తేటతెల్లమైంది. అప్పటికే 80 రోజుల పాటు కమిషన్ విచారణ జరిపింది. ఆ తర్వాత శశికళ పేరును జాబితాలో ఎక్కించారు. సెక్షన్ 8బీ కింద డిసెంబరు 21న శశికళకు, అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
మొదట జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె తిరిగి నడుస్తున్నారని.. ఆహారం కూడా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మళ్లీ ఇంతలోనే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చెబుతూ రాత్రికి రాత్రే ఆమె మరణించారని చెప్పడం అంతటా పెద్ద అనుమానాలకు తావిచ్చింది. అమ్మ మృతి వెనుక పెద్ద కుట్ర ఉందనే సందేహాలు రేగాయి.
ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ పేరునూ విచారణ జాబితాలోకి విచారణ కమిషన్ చేర్చింది. ఇందులో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. కమిషన్ ప్రశ్నలకు వచ్చిన సమాధానం ప్రకారం.. ఆసుపత్రిలో జయలలితకు అందించిన వైద్యంలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని వెల్లడైంది. దీంతో ఆర్ముగస్వామి కమిషన్ మరింతమందిని విచారించాలని నిర్ణయించుకుంది.
మరోవైపు విచారణలో భాగంగా శశికళ వేసిన ఓ దరఖాస్తును కమిషన్ 2018 డిసెంబరు 20న పరిగణలోకి తీసుకుంది. అందులోని సాక్షులకు అదేరోజు సమన్లు జారీ చేసింది. ఇందులో తేలిన విషయాల ద్వారా మరింత స్పష్టత అవసరమని కమిషన్ భావించింది. దీంతో విచారణ గడువును పొడిగించాలని ప్రభుత్వానికి విన్నవించింది.
ఆర్ముగస్వామి కమిషన్ విచారణలో కీలక విషయాలు బయటపడుతుండటంతో జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి ఇబ్బందుల్లో పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలా మొత్తం అందరినీ కలిపి 159 మందిని విచారించారు. పైగా కమిషన్‌కు వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి 302 ఫిర్యాదులొచ్చాయి. 30 మంది నుంచి అఫిడవిట్‌లు అందాయి. అనంతరం ఎట్టకేలకు తమ విచారణని ముగించి 2022 ఆగస్టు 27న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
కాగా నాడు ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. కేసును పరిశీలించాక నవంబర్ 22, 2017 నుంచి కమిషన్ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమికంగా కేసు మీద అవగాహనకు వచ్చాక.. 13 మందిని విచారిస్తే సరిపోతుందని భావించారు. ఇందులో ప్రముఖంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అపోలో ఆసుపత్రిలో అప్పట్లో ఉన్న ప్రభుత్వ ప్యానల్ డాక్టర్లు ఉన్నారు. వీరితో సమగ్రంగా మాట్లాడి ఆర్ముగస్వామి కమిషన్ వివరాలు సేకరించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.