Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డపై విచారణ.. చర్యలకు ప్రభుత్వం రెడీ?
By: Tupaki Desk | 2 Feb 2021 2:30 PM GMTఏపీ పంచాయితీ ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సీఎం జగన్ మధ్య వార్ ముదిరిపోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రగడ తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలకు ప్రతి చర్యలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.తాజాగా ఎస్ఈసీపై మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్లడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. స్పీకర్ తమ్మినేని దీనిని ప్రివిలేజ్ కమిటీకి పంపినట్లు చైర్మన్ గోవర్ధన్ తెలిపారు.
ఈ ఫిర్యాదును స్వీకరించామని.. ఎస్ఈసీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకునే అధికారం ఈ కమిటీ ఉందని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ సంచలన ప్రకటన చేశారు. విచారణ జరిపిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.రూట్ 173 కింద ఫిర్యాదులపై కమిటీలో చర్చిస్తామన్నారు.
ఇటీవల నిమ్మగడ్డ ఏపీ మంత్రులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు సైతం తిట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో తమపై చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు స్పీకర్ తమ్మినేనికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. నిమ్మగడ్డపై చర్యల దిశగా స్పీకర్ అడుగులు వేయడం సంచలనంగా మారింది.