Begin typing your search above and press return to search.
ట్రంప్ తీరుతో వైట్ హౌజ్ వాపోతుంది
By: Tupaki Desk | 18 Feb 2017 4:59 PM GMTరిపబ్లికన్ పార్టీ నాయకుడు - అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాలు అనంతరం అమెరికా పౌరుల ఆవేదన పరిస్థితి దాటి ఇపుడు ఏకంగా అగ్రరాజ్యాధిపతి కార్యాలయమైన వైట్ హౌజ్ షాక్ తింటోంది. ట్రంప్ పర్యటనల కోసం, ఆయన కుటుంబసభ్యుల భద్రత కోసం అవుతున్న ఖర్చు తడిసిపోపెడు అవుతుందని, వారి విలాసవంతమైన జీవన శైలి 'వైట్ హౌజ్' వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోందని అమెరికాలో అగ్ర మీడియా అయిన 'వాషింగ్టన్ పోస్ట్' కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల జీవన శైలి చూసి 'వైట్ హౌజ్' ట్రెజరీ అధికారులు బాబోయ్ అంటున్నారు. ట్రంప్ తన వ్యక్తిగత కార్యక్రమాల కోసం, భార్య మెలానియా, కుమారుల భద్రతకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారని తెలిసింది.ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, వారి కుమారుడు బారన్ వైట్ హౌస్ లో ఉండడం లేదు. వాళ్లు న్యూయార్క్‌లో ట్రంప్ టవర్స్‌లోనే ఉంటున్నారు. దీంతో న్యూయార్క్ పోలీసులు టవర్ బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ భద్రత కోసం రోజుకు 5 లక్షల డాలర్లు (సుమారుగు రూ.3.5 కోట్లు) ఖర్చవుతున్నాయి. ఈ లెక్కన సంవత్సరానికి సుమారుగా రూ.1227 కోట్లు 'ట్రంప్ టవర్స్' భద్రత కోసం ఖర్చు అవుతుందని అంచనా తేలింది. ఇటీవల ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ యూఏఈలో 'బెవర్లీ హిల్స్ ఆఫ్ దుబాయ్'లో ట్రంప్ బ్రాండ్ గోల్ఫ్ రిసార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీనిపైనా సీక్రెట్ సర్వీసెస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల ఆరంభంలో ట్రంప్ కుమారుడు ఎరిక్ ఉరుగ్వేలో ట్రంప్ బ్రాండ్ కాండో టవర్ ప్రమోషన్‌కు వెళ్లగా సీక్రెట్ సర్వీస్, అమెరికా ఎంబసీ స్టాఫ్‌కు హోటల్ గదుల బిల్లు లక్ష డాలర్లు అయ్యిందట. న్యూయార్క్ ట్రంప్ టవర్‌లో డిఫెన్స్, సీక్రెట్ సర్వీస్ ఏడాదికి 1.5మిలియన్ డాలర్ల ఒప్పందంతో ఒక అంతస్తు లీజుకు తీసుకున్నారు. ఇలాంటి షాక్ తో అమెరికా ప్రజలు, అధ్యక్షుడి భద్రతకు బాధ్యత వహించే సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ట్రంప్ ఫ్యామిలీ తీరుకు బిత్తర పోతున్నారు.
ట్రంప్, ఆయన కుటుంబసభ్యుల విలాసవంతమైన జీవన విధానం తీరు ఇటు సీక్రెట్ సర్వీస్ అధికారులకు, అటు ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగానికి తలకు మించిన భారంగా మారుతోందని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. వరుసగా మూడు వారాలుగా ట్రంప్ తన అనుచర గణాన్నంతా వెంట పెట్టుకుని ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో మార్-ఎ-లాగో క్లబ్‌కు వెళ్లి వారాంతపు సెలవుల్ని గడుపుతున్నారు. మార్-ఎ-లాగో క్లబ్‌కు ట్రంప్ మూడు సార్లు వెళ్లగా ఆయన పర్యటన ఖర్చు దాదాపు 10 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.67 కోట్లు) అయ్యిందట. గత శనివారం జపాన్ ప్రధాని షింజో అబేతో ట్రంప్ అక్కడే సమావేశమైన సంగతి తెలిసిందే. అత్యంత రహస్యంగా చర్చించాల్సిన అంతర్జాతీయ విషయాలను ఇలా క్లబ్‌లో కూర్చొని మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి నెల గడుస్తున్నా ఇంకా ట్రంప్ యంత్రాంగం కుదురుకోలేదు. గత అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ నాలుగేళ్ల పదవీకాలం ముగిసేసరికి ఆయన రవాణాకు, భద్రత కోసం చాలా ఎక్కువ ఖర్చు కావొచ్చని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/