Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స్ఫూర్తితో.. హ‌ర్యానా సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   7 July 2020 11:30 AM GMT
జ‌గ‌న్ స్ఫూర్తితో.. హ‌ర్యానా సంచ‌ల‌న నిర్ణ‌యం
X
పాల‌న‌లో కొత్త‌ద‌నం.. విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు.. పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న సాగిస్తున్నారు. ప్ర‌జ‌లంద‌రికీ సంక్షేమం.. పాల‌న‌.. అభివృద్ధి చేరువ చేసే యోచ‌న‌లో విభిన్న నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌న చేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు.. నిర్ణ‌యాలు ఇత‌ర రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయి. ఏపీ స్ఫూర్తితో త‌మ రాష్ట్రంలో అమ‌లుచేసేందుకు ప‌లు రాష్ట్రాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే చాలా అంశాలను ఏపీ ఆద‌ర్శంతో ప‌లు రాష్ట్రాల్లో త‌మ పాల‌న‌లో మార్పులు చేశాయి.. నిర్ణ‌యాలు తీసుకున్నాయి. తాజాగా మ‌రో రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అమ‌లు చేసిన ఓ నిర్ణ‌యాన్ని కాపీ కొడుతోంది. త‌మ రాష్ట్రంలో ఏపీలో అమ‌లు చేసే విధానం అమ‌లు చేయ‌నుంది. ఆ రాష్ట్ర‌మే హ‌ర్యానా. ఏ అంశంలో కాపీ కొడుతుందంటే..

రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇవ్వాలని సీఎం జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యం ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. వాస్త‌వంగా నిర్ణ‌యం తీసుకున్న మొద‌ట అమలు సాధ్యం కాద‌‌ని అధికారులు చెప్పారు. కానీ జగన్ పట్టుదలతో దీన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అదే నిర్ణ‌యాన్ని మిగతా ప్రభుత్వాలు అమ‌లు చేసేందుకు స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయి.

ఏపీలో 75 శాతం స్ధానిక కోటా నిర్ణయం అమలుకు అసెం0బ్లీ చట్టం చేసిన తర్వాత కర్నాటకలో యడ్యూరప్ప ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం అమలుకు సిద్ధ‌మైంది. దీనిపై ఆ రాష్ట్రంలో కొంత వ్య‌తిరేక‌త‌.. అనుకూల‌త వ్య‌క్త‌మైనా చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప అమలు చేసేందుకే సిద్ధ‌మ‌య్యారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్-శివసేన సంకీర్ణ ప్రభుత్వం జ‌గ‌న్ క‌న్నా ఎక్కువగా ఏకంగా 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలను స్ధానికులకు కేటాయించాలని నిర్ణయించింది.

ఇప్పుడు తాజాగా హరియాణాలో కూడా ఇదే విధానం అమ‌లు చేయాల‌ని యోచిస్తోంది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని బీజేపీ-జేజేపీ సర్కారు కూడా స్థానికుల‌కే ఉద్యోగాల్లో సింహ‌భాగం ఇవ్వాల‌ని నిర్ణయించింది. అన్ని ప్రైవేటు ఉద్యోగాల్లో 80 శాతం స్ధానికులకు కేటాయిస్తూ త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే కేటాయించాల్సి ఉంటుంది. ప్రైవేటు కంపెనీలు, ట్రస్టులు వంటి వాటిలో నెలకు రూ.50 వేల కన్నా తక్కువ జీతం ఉండే ఉద్యోగాల్లో 75 శాతాన్ని కచ్చితంగా స్ధానికులకే కేటాయించాల్సి ఉంటుంది.

బాస్ ల స్ధాయిలో ఉండే ఉద్యోగాలకు మాత్రం ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చు. అయితే స్ధానిక అభ్యర్ధులు దొరకని పరిస్ధితుల్లో మాత్రమే కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుంది. మిగతా వారంతా ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని హ‌ర్యానా ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ నిర్ణ‌యం అమ‌లు చేస్తే హ‌ర్యానాలో తీవ్ర ఆటంకం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీకి స‌రిహ‌ద్దుగా ఉన్న హర్యానా పరిధిలోకి గురుగ్రామ్, ఢిల్లీ ఎన్.సి.ఆర్ కూడా వస్తాయి. ఇక్కడ పలు మల్టీ నేషనల్ కంపెనీలు, భారీ కార్పొరేట్ సంస్ధల కార్యాలయాలు ఉన్నాయి. స్థానిక ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్ అమ‌లుచేస్తే ఇప్పుడు వీరికి ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి.