Begin typing your search above and press return to search.

100 ఆపరేషన్లు.. 101వ సారి మృతి

By:  Tupaki Desk   |   1 May 2017 10:19 AM GMT
100 ఆపరేషన్లు.. 101వ సారి మృతి
X
అందం సహజంగా రావాలే కానీ ఆపరేషన్ చేయించుకుని పెంచుకుంటే ప్రాణాలకే ప్రమాదమని నిరూపణ అయింది. సోషల్ మీడియా స్టార్ గా మాంచి పాపులర్ అయిన క్లిస్టినా మార్టెల్లీ అందం యావలో ఆపరేషన్ల మీద ఆపరేష్లను చేయించుకుని చివరకు 101వ ఆపరేషన్ కు రెడీ అవుతూ ఏకంగా ప్రాణాలు కోల్పోయింది.

అందం కోసం 100 సర్జరీలు చేయించుకున్న సోషల్ మీడియా స్టార్ క్రిస్టినా మార్టెల్లీ 101వ సర్జరీ సమయంలో మరణించిన విషయం కాస్త లేటుగా బయటపడింది. క్యుబెక్ లో పుట్టిపెరిగిన క్రిస్టినా మార్టెల్లీ 17 ఏళ్ల వయసు నుంచే అందంగా, మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకోవడం మొదలు పెట్టింది. అలా ఇప్పటి వరకు ఆమె సుమారు 100 సర్జరీలు చేయించుకుంది. ఆకర్షించేందుకు ఉపయోగపడే ప్రతి భాగాన్ని ఆమె సర్జరీలతో తీర్చిదిద్దుకుంది. గత నెల 18న 101వ సర్జరీకి సిద్ధమవుతున్న సమయంలో ఆమె గుండెపోటుకు గురై మరణించినట్టు తెలుస్తోంది.

ఆమె పిరుదులకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైందని, దీంతోనే ఆమె మరణించిందని అంటున్నారు. మోడల్ గా ఆకట్టుకున్న ఆమెకు సుమారు 6 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. తన సర్జరీల వెనుక ఒకటే కారణమని, తన శరీరాన్ని ఎప్పటికప్పుడు మరింత అందంగా చూసుకోవడం తనకు ఇష్టమని తెలిపింది. ఆమె మరణించినట్టు ఆమె స్నేహితురాలు ఏప్రిల్ 21న నిర్ధారించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/