Begin typing your search above and press return to search.
ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా ..తస్మాత్ జాగ్రత్త, ఏమైందంటే
By: Tupaki Desk | 16 Sep 2021 5:30 PM GMTఫేస్ బుక్ కు చెందిన ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీన్ని వాడుతున్నారు. ముఖ్యంగా యువతను ఇన్‌స్టాగ్రామ్ చాలా ఆకర్షిస్తోంది. తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేసేందుకు యూత్ ఈ యాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు టీనేటర్లకు, ముఖ్యంగా యువతులకు ఇన్ స్టాగ్రామ్ ప్రమాదకరంగా మారిందని ఫేస్ బుక్ స్వయంగా సిద్ధం చేసిన నివేదిక వెలువరించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.
యువతపై ఇన్ స్టాగ్రామ్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయంపై ఆ కథనం ఉంది. గత మూడేళ్ల డేటాను ఫేస్ బుక్ అందులో పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్ వల్ల కొందరు టీనేజర్లలో అత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయన్న సంచలన విషయాలను ఫేస్ బుక్ పొందుపరిచిందని వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న టీనేజర్లలో బ్రిటన్లో 13 శాతం, అమెరికాలో ఆరు శాతం మందిలో సూసైడికల్ ఆలోచనలు ఉన్నట్టు గుర్తించినట్టు ఫేస్ బుక్ తెలిపిందట. అలాగే ఇన్ స్టాగ్రామ్ వల్ల తమ శరీరాకృతి పట్ల 32 శాతం మంది టీనేజర్లు అసంతృప్తిగా మారారని, వారి పట్ల వారికి అయిష్టం కలిగేందుకు ఇన్ స్టా కారణమవుతోందని చెప్పింది.
ఇలా అయ్యేందుకు యాప్ లో కొన్ని ఫీచర్లు కారణమని ఫేస్ బుక్ పేర్కొందని ఆ కథనంలో ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ ఎక్స్ ప్లోర్ పేజ్ ప్రమాదకరంగా మారిందని రీసెర్చర్లు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. అకౌంట్ల నుంచి కొన్ని పోస్టులను సేకరించి క్యూరేట్ చేసి ఈ ఫీచర్ యూజర్లకు చూపిస్తోంది. అయితే ఇందులో చోటు దక్కించుకోవాలనే ఆలోచనలో కొందరు టీనేజర్లు ప్రమాదకరమైన కంటెంట్ చేస్తున్నారని పేర్కొంది. అలాగే అత్యుత్తమైన ఫొటోలను, వీడియోలే ఎక్స్ ప్లోర్ లో వస్తుండటంతో చాలా మంది బాగా కనిపించాలనే తపనతో ఈ ప్లాట్ ఫామ్ కు బానిస అవుతున్నారని చెప్పింది.
ఇన్ స్టాగ్రామ్‌పై పరిశోధకులు తయారు చేసిన ఈ నివేదకను ఫేస్ బుక్ ఉన్నతాధికారులు పరిశీలించారని, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు కూడా నివేదించారని సమాచారం. అయితే ఈ సమస్యకు ఫేస్ బుక్ ఇంకా పరిష్కారం కనుగొనలేదట. ఈ క్రమంలో 13 సంవత్సరాల లోపు పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ఇన్ స్టాగ్రామ్ వెర్షన్ ను ఫేస్ బుక్ తీసుకురానుంది. కాగా ఇన్ స్టాగ్రామ్ లో 22 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యూజర్లు 40 శాతం మంది వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నా టీనేజర్లు మాత్రం ఆ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.