Begin typing your search above and press return to search.
కరోనా టీకా వీళ్లకు మాత్రం ఇవ్వొద్దు!!
By: Tupaki Desk | 12 Jan 2021 4:30 AM GMTదాదాపు ఏడాదిగా కరోనా వైరస్ ధాటికి ప్రపంచమే లాక్ అయిపోయింది. దేశంలో మార్చి నుంచి ఈ మహమ్మారి ఎంట్రీ ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తయారీ కోసం ఏడాదిగా శ్రమించిన శాస్త్రవేత్తలు 2021 సంవత్సరంలో దాన్ని రిలీజ్ చేశారు.
భారత్ లో రెండు టీకాలకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ ఈనెల 16 నుంచి భారత్ లో పంపిణీ కానున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) కీలక సూచనలు చేసింది. టీకా వేసుకునే వారికి ఈ లక్షణాలు ఉండొద్దని.. ఇవి ఉంటే టీకాలు తీసుకోవద్దని సూచించింది.
తీవ్రమైన అలర్జీ ఉన్నవారు, గర్భిణిలు, పాలిచ్చే బాలింతలు, 16 ఏళ్లలోపు పిల్లలు కోవిడ్ టీకాకు దూరంగా ఉంటే మంచిదని డబ్ల్యూ.హెచ్.వో పేర్కొంది. వారి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వారిపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇక టీకా తీసుకున్న మహిళలు కనీసం 2-3 నెలల పాటు గర్భాధారణకు దూరంగా ఉండాలని సూచించింది. ట్రయల్స్ లో హెచ్.ఐ.వీ రోగులకు సంబంధించిన డేటా పరిమితంగా ఉందని.. ఆ విషయాన్ని ఆయా బాధితులకు ముందే చెప్పాలని పేర్కొంది.