Begin typing your search above and press return to search.
లోకేష్‌ను డమ్మీ చేశారు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా బాబూ..!
By: Tupaki Desk | 12 Dec 2021 2:30 AM GMTటీడీపీలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. లోకేష్‌ను డమ్మీ చేశారు.. చాలా నష్టమే జరిగిందని .. నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదేంటి? అని ఆశ్చర్య పోతున్నారా? కొన్ని వారాల కిందట.. అధికార పార్టీ వైసీపీ నాయకులు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రాదని.. అంటూనే.. వచ్చినా.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే.. వస్తుందని.. అందుకే చంద్రబాబు అహోరాత్రులు కష్టపడు తున్నారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ.. పార్టీ అనుకూల మీడియా లోనూ.. ప్రచారం అయ్యాయి.
దీంతో టీడీపీలో ఒక సంచలనం చోటు చేసుకుంది. పార్టీ అధికారంలోకి వస్తే.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వాదన ప్రజల్లోనూ బయల్దేరింది. దీంతో చంద్రబాబు నుంచి కింది స్థాయి కేడర్ వరకు కూడా.. అంతర్మథనం చెందారు. ఎందుకంటే.. ఒక్కసారికూడా ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా నిరూపించుకోలేక పోయిన.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటే.. ప్రజలు మరోసారి తిరుగుటపాలో పార్టీని ఘోరంగా ఓడించడం ఖాయమని.. చంద్రబాబు సహా.. ఆయన అనుకూల మీడియా లెక్కలు వేసుకున్నారు.
దీంతో వెంటనే.. అదేంలేదు.. చంద్రబాబు తప్ప ఇంకెవరూ.. ముఖ్యమంత్రిగా అర్హులు కారు! అని ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో లోకేష్‌ను ఆటలో అరటి పండును చేశారు. చంద్రబాబును మెచ్చుకోవడం.. పొగడ్తలతో పైకి తెచ్చుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేసమయంలో లోకేష్ ను డమ్మీ ని చేసేశారు. దీంతో ఈ పరిణామం నుంచి లోకేష్ ఇంకా బయటకురాలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన బహిరంగ వేదికలపైనా.. ఇటీవల కాలంలో కనిపించడం లేదు. అంతేకాదు.. ఎక్కడా మీటింగులు కూడా పెట్టడం లేదు. కేవలం ప్రెస్ నోట్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా నిత్యం జోష్‌గా స్పందించే లోకేష్ పరిస్థితి కుక్కిన పేనల్లే మారిపోయిందని అంటున్నారు. ఇది పూర్తిగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేసిందని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఈ ప్రభావం ఒక్క లోకేష్‌తోనే పోలేదు.. పార్టీలోని యువతకు కూడా చుట్టుకుంది. ఎందుకంటే.. ఏదైనా సమస్య ఉంటే.. యువత నేరుగా లోకేష్‌కు పెచ్చుకునేవారు.
ఇప్పుడు లోకేష్ యాక్టివ్‌గా లేకపోవడం.. రాష్ట్ర వ్యాప్తంగా.. టీడీపీ యువతను నడిపించే నాయకుడు లేకుండా పోయాడనేది వాస్తవం. తాజాగా తెలుగు యువత నేతల ప్రమాణస్వీకారానికి కూడా లోకేష్ డుమ్మా కొట్టాడు. దీనిని బట్టి.. లోలోన అంతర్మథనం ఎక్కువగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. సో.. దీనిని బట్టి.. కొండనాలిక్కి మందు వేయాలను కుంటే.. ఉన్ననాలిక పోయినట్టు అయిందని అంటున్నారు.