Begin typing your search above and press return to search.
నోరుజారిన ఫలితంః ధర్మారెడ్డిపై విమర్శల జడి.. సీఎం పైనా..
By: Tupaki Desk | 2 Feb 2021 11:45 AM GMTబలహీన వర్గాలు రిజర్వేషన్ కారణంగా ప్రతిభ లేకున్నా ఉద్యోగాలు పొందుతున్నారని, ఏ ఆఫీసులో చూసినా వాళ్లే కనిపిస్తున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై విమర్శల జడివాన కురుస్తోంది. ఆయన అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా.. విపక్షాలు ఆయనతోపాటు టీఆర్ ఎస్ పార్టీని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేశాయి.
చల్లా ధర్మారెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని రిజర్వేషన్లు పొందుతున్న వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి దాసు సురేష్.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులను ఎమ్మెల్యే ధర్మారెడ్డి అసమర్థులుగా అభివర్ణించడం ద్వారా అవమానించారని విమర్శించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు కూడా నిన్న సాయంత్రం నుండి ధర్మ రెడ్డిని దునుమాడుతున్నాయి. దీంతో.. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ధర్మారెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తాను ఎవరినీ బాధించాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అన్నారు.
తాజాగా.. ఈ ఘటనపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. బలహీన వర్గాలను ముఖ్యమంత్రి ఎలా చూస్తారో.. తమ ఎమ్మెల్యేలు కూడా అలాగే చూస్తున్నారని, ఈ విషయంలో వారు కేసీఆర్ నే అనుసరిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు కేసీఆర్ విలువ ఇవ్వడం లేదు. కాబట్టి, అతని పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు’’ అని విజయ శాంతి అన్నారు.
తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి వంటి దళిత నాయకులను కేబినెట్ నుంచి తొలగించిన కేసీఆర్.. వారిని అవమానించారని, ఇప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా అదే భాష మాట్లాడుతున్నారని, అందులో ఆశ్చర్యపడాల్సింది లేదని అన్నారు. ‘‘రు కేవలం ఆదేశాన్ని అనుసరిస్తున్నారు.. యథా సీఎం, తథా ఎమ్మెల్యే’’ అని విజయశాంతి ఆరోపించారు.