Begin typing your search above and press return to search.
మద్యం తాగి మరణిస్తే ఇన్సురెన్స్ వర్తించదు : సుప్రీం !
By: Tupaki Desk | 23 March 2021 12:30 PM GMTఇన్సురెన్స్ చెల్లింపుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు మందుబాబులకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే భీమా కలిగిన వ్యక్తి ఎక్కువగా మద్యం తాగి అనారోగ్య కారణాలతో చనిపోతే బాధిత కుటుంబానికి ఇన్సురెన్స్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న వ్యక్తి 1997లో మరణించాడు.
అతిగా వర్షాలు కురవడం, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించాడని అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, అతడు అతిగా లిక్కర్ తాగడం కారణంగా చనిపోయాడని పోస్టుమార్టంలో బట్టబయలైంది. అతడు ప్రమాదంలో మరణించలేదు కాబట్టి పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ ఒప్పుకోలేదు. దీనితో బాధిత కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్ లతో కూడిన ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
హిమాచల్ అటవీ సంస్థలో 3వేల 8 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరికి జనతా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బీమా చేశారు. ఈ స్కీమ్ కింద.. ఏదైనా ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ఇస్తారు. ఈ మేరకు హిమాటల అటవీ సంస్థ.. న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అతిగా మద్యం సేవించే మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్సురెన్స్ చేయించాం, ఇంకేం భయం లేదు, పరిహారం వచ్చేస్తుందిలే అని అనుకుంటే పొరపాటే. కాబట్టి తక్కువ మోతాదులో మద్యం తీసుకోని హాయిగా జీవించండి.