Begin typing your search above and press return to search.
మానవబాంబు ప్లాన్స్ పై ఐబీ హెచ్చరికలు ఇవేనా?
By: Tupaki Desk | 10 Oct 2016 6:06 AM GMTభారత్ పార్లమెంటుపై దాడి పునరావృతం కానుందా? సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం రగిలిపోతున్న పాక్ నెక్స్ట్ పార్లమెంట్ పై దాడిచేయబోతుందా? దీనికోసం ఉగ్రవాదుల సహాయం కోరిందా? ఇలాంటి అనుమానాలను తాజాగా భారత అధికారులు జారీచేసిన హెచ్చరికలు నిర్ధారిస్తున్నాయి! సర్జికల్ స్ట్రైక్స్ లో దెబ్బతిని పగతో రగిలిపోతున్న పాక్ - భారత పార్లమెంటుపై మరోసారి దాడి చేయించే యోచనలో ఉందని, దీనికోసం ఉగ్రసంస్ధ జైష్ ఏ మొహమ్మద్ (జేఈఎమ్) సాయం కోరిందని సమాచారం అందుతుందట. దీంతో భారత ఇంటెలిజెన్స్.. వివిధ శాఖల అధికారులను హెచ్చరించింది.
పాక్ కోరడంతో భారత పార్లమెంటుపై మళ్లీ దాడిచేసేందుకు జేఈఎమ్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వ్యూహం రచిస్తున్నట్లుగా భారతీయ ఇంటెలిజెన్స్ సంస్ధలు హెచ్చరిస్తున్నాయి. ఎలాగైనా ఈ దాడిచేయాలని అజర్ నుంచి ఆపరేటివ్స్ కు ఇప్పటికే సూచనలు అందినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో భారత పార్లమెంట్ పై మానవబాంబు ప్రయత్నాలు ఏమాత్రం ఫలించకపోయినా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ సెక్రటేరియట్ - అక్షరధాం - లోటస్ టెంపుల్సే అని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే క్రమంలో ముందుగా ఎంచుకున్న పార్లమెంట్ - ఢిల్లీ సెక్రటేరియట్ లపై దాడి ఫలించని పక్షంలో జనాలు ఎక్కువగా ఉండే చోట మానవ బాంబును ప్రయత్నించాలనే యోచనలో కూడా జేఈఎం ఉందని, ఇప్పటికే ఈ పనికోసం ఇద్దరు జేఈఎమ్ టెర్రరిస్టులు మానవబాంబు కావడానికి మారణాయుధాలతోసహా ఆపిల్ పండ్ల ట్రక్కు ద్వారా ఢిల్లీలోని ఓ మార్కెట్ కు వచ్చినట్లు కథనాలు వచ్చాయి!
ఇదే సమయంలో పర్యటక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు అన్నింటికీ ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో భదత్రను భారీగా పెంచారు. ముఖ్యంగా తాజ్ మహల్ వద్ద అయితే ఏకంగా 36 మంది కమాండోలను ప్రత్యేకంగా మోహరించారు. ఇదే సమయంలో మరోపక్క దసరా ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ నగరాలన్నింటిలోనూ భద్రతను పెంచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/