Begin typing your search above and press return to search.
వన్డే కెప్టెన్సీ: బీసీసీకి, కోహ్లీకి మధ్య ముదురుతున్న వివాదం
By: Tupaki Desk | 15 Dec 2021 2:32 PM GMTబీసీసీఐకి, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య వివాదం ముదురుతోంది. వన్డే కెప్టెన్సీ విషయంలో ఉన్న ఫళంగా కోహ్లీని పక్కనపెట్టి రోహిత్ శర్మకు పగ్గాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో కోహ్లీ అభిప్రాయం తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. కానీ తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్న సందర్భంగా విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలు బీసీసీఐని ఇరుకునపెట్టారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బీసీసీఐ అధికారులు తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని పేర్కొన్నాడు.
అయితే కోహ్లీ వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కొట్టిపారేసింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పునకు సంబంధించి సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని వెల్లడించింది. 'విరాట్ కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే అతడితో చర్చలు జరిపాం. మా ఆలోచనతో ఏకీభవించిన కోహ్లీ.. టీ20 పగ్గాలను వదులుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. జట్టులో సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ భావించింది. దీంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని నిర్ణయించింది. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మతో కోహ్లీ ముందుగానే చర్చించాడు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇక బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండు రోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే..