Begin typing your search above and press return to search.
'నా ఇష్టం నాగబాబు' కు ఊహించని షాక్!
By: Tupaki Desk | 26 Jan 2019 4:01 PM GMTనాగబాబు. ఈ పేరు వినగానే ఓ టీవీ షోలో కామెడీ లేకపోయినా కాసింత ఎక్కువ నవ్వే మనిషే గుర్తొస్తాడు. అన్నకు అండగా - తమ్ముడికి తోడుగా నిలవాలని ఈ మెగా బ్రదర్ ఈ మధ్య తెగ ఉబలాటపడిపోతున్నాడు. అందుకు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను చోదకాలుగా ఎంచుకున్నాడు. గతంలో తన అన్నను విమర్శించిన వారిని, ఇప్పుడు తన తమ్ముడిని తిడుతున్న వారిని టార్గెట్ చేస్తూ నాగబాబు ఇటీవల తన యూట్యూబ్ చానల్‌లో ఓ సిరీస్‌ను నడిపిస్తున్నాడు. దానికి ఇప్పుడు కొత్తగా ‘మై చానల్-నా ఇష్టం’ అనే పేరు కూడా పెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది. మొన్న బాలకృష్ణ, నిన్న నారా లోకేష్ - నేడు జగన్. ఇలా తన తమ్ముడు ప్రత్యర్థులుగా భావించే వారందరిపై వీడియోల రూపంలో విరుచుకుపడుతున్న ఈ మెగా బ్రదర్‌కు ఊహించని షాక్ తగిలింది. బాలకృష్ణకు కౌంటర్లు - లోకేష్ పై సెటైర్లు వేసిన సందర్భంలో ఎంత వ్యతిరేకత ఎదురైందో లేదో తెలియదు గానీ జగన్ పై చేసిన వీడియో విషయంలో మాత్రం నాగబాబుకు ఊహించని ఎదురుదాడి ఎదురవుతున్న పరిస్థితి. వైసీపీ అభిమానులు - కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగబాబు తాజాగా జగన్ పై చేసిన వీడియో పేరు ‘ఓ జగన్ గారి బిర్యానీ కథ’. ఈ వీడియోలో జగన్ గతంలో చేసిన సంభాషణలను గుర్తు చేస్తూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు.
రాజకీయాలను ప్రస్తావిస్తూ నాగబాబు చేసిన ఈ వీడియోపై వైసీపీ శ్రేణులుతో పాటు బాలయ్య అభిమానులు కూడా విరుకుపడుతుంటం విశేషం. సామాన్య నెటిజన్ల నుంచి కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన అన్న చిరంజీవి రూపంలోనే నాగబాబుకు ఈ పరిస్థితి ఎదురుకావడం కొసమెరుపు. జగన్ తన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డబ్బు తీయాలని అంటున్నాడని, ఎందుకు తీయాలని మెగా బ్రదర్ చేసిన కామెంట్‌పై ప్రతిదాడి మొదలైంది. తన అన్న చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ల అమ్మకాల వ్యవహారం గురించి బహుశా నాగబాబు మర్చిపోయారా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన తమ్ముడు ఓ హోటల్ లో టికెట్ల అమ్మకాలకు సంబంధించి బేరసారాలు చేసిన విషయం గుర్తులేదేమో అని మరికొందరు నెటిజన్లు నాగబాబుపై విరుచుకుపడుతున్నారు. పవన్‌పై ఉన్న గౌరవంతోనే ఈ బేరసారాల వీడియోలను బయటపెట్టడం లేదని సదరు జర్నలిస్ట్ వాపోయిన సంగతిని గుర్తుచేస్తున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో కూడా నాగబాబు ఇలాంటి వీడియోలను చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు వ్యంగ్యాంస్త్రం సంధిస్తున్నారు. నాగబాబు తీరు.. ఆయన వ్యాఖ్యలు గురివింద గింజ సామెతగా ఉన్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. నాగబాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్న వారూ లేకపోలేదు. నాగబాబు ఇలాంటి వీడియోలతో ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జనసేన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని.. ప్రక్షాళన జరగాలంటే అది ఒక్క పవన్ వల్లే సాధ్యమని జనసేన అభిమానులు నొక్కి మరీ చెబుతున్నారు. ఏదేమైనా రాజకీయాలపై మెగా బ్రదర్ నాగబాబు చేస్తున్న వీడియోలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతున్నాయి. టీడీపీ - వైసీపీ సోషల్ మీడియా విభాగాలకు కౌంటర్ వీడియోలు చేసే అవకాశం ఇస్తూ మరింత పనిని కల్పిస్తున్నాయి. అయితే.. ఈ వీడియోలతోనే నాగబాబు కాలం గడిపేస్తారా లేక పవన్ కు మద్దతుగా ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మెగా కుటుంబం పవన్ కు రాజకీయంగా ఎంతవరకూ అండగా నిలుస్తుందనే అంశంపై కూడా హాట్‌హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. చిరంజీవి జనసేనకు అండగా నిలుస్తారో లేదో అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.