Begin typing your search above and press return to search.

మూడో వేవ్ లో ఇది చాలా ముఖ్యం.. తీవ్రత అప్పుడే చాలా ఎక్కువట

By:  Tupaki Desk   |   24 Aug 2021 2:18 AM GMT
మూడో వేవ్ లో ఇది చాలా ముఖ్యం.. తీవ్రత అప్పుడే చాలా ఎక్కువట
X
అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుందన్న మాట వినిపించిన మూడో వేవ్ ఆగస్టు నాలుగో వారంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా కనిపించకపోయేసరికి.. చాలా మంది లైట్ తీసుకోవటం తెలిసిందే. అసలు మూడో వేవ్ ఉందా? లేదా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో అమెరికా.. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వైనం చూసినోళ్లు.. మన వద్ద అందుకు భిన్నమైన పరిస్థితుల్ని చూసి.. మూడో వేవ్ ముప్పు మనకు పెద్దగా ఉండదని కొట్టి పారేస్తున్నారు. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కేసుల నమోదు తగ్గటమే కాదు.. కరోనా పాజిటివ్ గా తేలుతున్న వారిలో కనిపిస్తున్న వైరస్ లోడ్ తక్కువగా ఉండటంతో మూడో వేవ్ ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు భిన్నంగా తాజాగా ఐఎండీ.. నీతిఅయోగ్ లు సిద్ధం చేసిన నివేదిక బయటకు రావటం.. అందులో పేర్కొన్న అంశాలు అందరిని ఉలిక్కిపడేలా చేశాయి. ఎప్పుడో కాదు సెప్టెంబరు మొదట్లోనే మూడో వేవ్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందన్న మాటను చెప్పటమే కాదు.. తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పి వణికేలా చేసింది. నివేదికలో పేర్కొన్న రీతిలో రోజువారీ కేసులు అంత తీవ్రంగా ఉంటే.. భయంకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పక తప్పదు. ఏపిల్ - మే లలో నమోదైన కేసులు రోజువారీగా నాలుగు లక్షల కేసులే. ఆ లెక్కన చూస్తే.. మూడో వేవ్ లో మరిన్ని కేసులు ఎక్కువగా ఉంటాయన్నది అర్థమవుతుంది.

అయితే.. తీవ్రత ఎక్కువగా ఉండటానికి అవకాశం నిజంగానే ఉందా? లేదంటే అనవసరంగా భయపడుతున్నామా? నివేదికలోని అంచనాలు తప్పు కాకూడదని ఏముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి వస్తే.. నివేదిక తప్పు కావటానికి..అంచనాలు ఫెయిల్ అవ్వటానికి ఉన్న అవకాశం ఏదైనా ఉందంటే.. కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ వస్తేనే తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఐఐటీ కాన్పూరుకు చెందిన సైంటిస్టు మణీంద్ర అగర్వాల్ అంచనా ప్రకారం.. డెల్టా కంటే తీవ్రమైన వేరియంట్ కనుక లేకపోతే.. మూడో వేవ్ తీవ్రత పెద్దగా ఉండదని చెబుతున్నారు. మూడో వేవ్ తీవ్రత మొత్తం.. కొత్త వేరియంట్ మీదనే ఆధారపడి ఉంటుందన్న విషయం స్పష్టం కాక మానదు. సో.. మూడో వేవ్ కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం తప్పు కాదు. అదే సమయంలో.. అనవసరమైన ఆందోళన చెందకుండా ఉండటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.