Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజల్ని ‘జవాద్’ తుపాన్ ఏం చేయనుంది?

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:26 AM GMT
ఏపీ ప్రజల్ని ‘జవాద్’ తుపాన్ ఏం చేయనుంది?
X
తమిళనాడు లో కురిసిన భారీ వర్షాల తీవ్రత ఏపీ మీద పడటమే కాదు.. తిరుపతి.. నెల్లూరు జిల్లాల తో సహా పలు జిల్లాల్లో ఎంత భారీగా వర్షాలు కురిసాయో తెలిసిందే. ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత నుంచి ఏపీ బయటకు వస్తున్న వేళ.. మరో వాయుగుండటం.. ఏపీ కి గండంగా మారింది.

గల్ఫ్ ఆఫ్ థాయి లాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రం లోకి నేడు ప్రవేశించే వీలుంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో మరో అల్ప పీడనానికి అవకాశం ఉందంటున్నారు.

ఒకవేళ ఇప్పుడున్న అంచనాలకు తగ్గట్లే.. ఈ ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారి.. తపానుగా రూపాంతరం చెందితే దీనికి జవాద్ అని పేరు పెట్టనున్నారు. ఈ తుపాన్ ప్రభావం ఏపీ మీద కచ్ఛితంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్ని తీవ్రంగా ప్రభావితం చేసి.. ఏపీని ఇబ్బంది పెట్టిన తీవ్ర అల్పపీడనం ఇప్పుడే బలహీన పడిన వేళ.. ఏపీ ఊపిరిపీల్చుకుంటోంది.

అంత లోనే మరో ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారి.. తుఫాను గా మారటం ద్వారా ఇబ్బందులు ఖాయమంటున్నారు. మరి.. దీని ప్రభావం ఎంత ఉంటుంది? ఏపీని ఏం చేయనుంది? లాంటి అంశాలపై స్పష్టత రావటానికి మరో రెండు.. మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ వరుస విపత్తులతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.