Begin typing your search above and press return to search.

కులాంతర వివాహం చేసుకున్నాడ‌ని.. గ్రామ పెద్ద‌లు ఏం చేశారంటే..?

By:  Tupaki Desk   |   4 Aug 2021 9:30 AM GMT
కులాంతర వివాహం చేసుకున్నాడ‌ని.. గ్రామ పెద్ద‌లు ఏం చేశారంటే..?
X
భార‌త దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న అతిపెద్ద క్యాన్స‌ర్ కులం. మ‌తాల పేరుతో కొట్టుకు చచ్చేవారు కూడా.. మ‌ళ్లీ కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. చంపుకుంటున్నారు. ఇలాంటి సంఘ‌ట‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నోచూశాం. తాజాగా.. ఇలాంటి ఘ‌ట‌న మ‌రొక‌టి వెలుగు చూసింది.

దేశంలో కుల జాఢ్యపు తీరు ఎలా ఉందో.. ఒడిషా రాష్ట్రంలోని ఆనంద‌పూర్ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని ఖాలియామెంట నియ‌లిజ‌ర‌ణ గ్రామ పంచాయ‌తీలోని సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. ఓ వ్య‌క్తి త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడ‌నే కార‌ణంతో.. ఏకంగా 25.60 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌రిమానా విధించారు గ్రామ పంచాయ‌తీ పెద్ద‌లు. అంతేకాదు.. కులం క‌ట్టుబాటును వ్య‌తిరేకించార‌ని, ఆ కుటుంబాన్ని కూడా వెలివేశారు.

ఖాలియామెంట గ్రామానికి చెందిన మ‌హేశ్వ‌ర్ బాస్కే అనే వ్య‌క్తి.. వేరే కులానికి చెందిన యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కొంత కాలం వేరే ఊరిలోనే జీవించాడు. ఈ మ‌ధ్య‌నే సొంత ఊరికి వ‌చ్చాడు. దీంతో.. ఈ విష‌యం తెలుసుకున్న కుల పెద్ద‌లు.. ఆ వ్య‌క్తి ఏదో చేయ‌గూడ‌ని నేరం చేసిన‌ట్టు ఇలాంటి ప‌నికిమాలిన తీర్పు ఒక‌టి జారీచేశారు.

మ‌హేశ్వ‌ర్ బాస్కేది ఒక నిరుపేద కుటుంబం. గ్రామ పెద్ద‌ల తీర్పుతో ఆందోళ‌న‌కు గురై.. మ‌ళ్లీ వేరే గ్రామానికి వెళ్లి నివ‌సిస్తున్నాడు. మ‌హేశ్వ‌ర్ కుటుంబ స‌భ్యులు ఈ విష‌య‌మై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న కొడుకును పెద్ద మ‌నుషులు ఊళ్లో ఉండ‌నీయ‌కుండా చేస్తున్నార‌ని అత‌ని త‌ల్లి వాపోయింది. ఈ మేర‌కు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు. మ‌రి, అధికారులు ఎలాంటి న్యాయం చెబుతార‌నేది చూడాలి.