Begin typing your search above and press return to search.
గమనించారా:అప్పుడు రిషితేశ్వరి..ఇప్పుడు భాను
By: Tupaki Desk | 22 Sep 2015 4:15 AM GMTమరో దారుణం చోటు చేసుకుంది. ఏపీలోని ఒక కళాశాలలో ఒక విద్యార్థిని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర సంచలనంతో పాటు.. ఉద్రిక్తతలకు దారి తీసిన ఈ ఉదంతంలోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన భానుప్రీతి ఈ ఏడాది విజయవాడ స్టెల్లా కాలేజీలో చేరింది.
14 రోజుల పాటు ఇంటి వద్దనే ఉన్న ఆమె హాస్టల్ కు వచ్చిన తర్వాతి రోజు ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సోమవారం బయటకు వచ్చింది. ఓ క్లాస్ టెస్ట్ కు హాజరుకావాల్సి ఉన్నా.. ఆమె ఆరోగ్యం బాగోలేదని హాస్టల్ గదిలో ఉండిపోయిన ఆమె.. తనుము చాలించి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ఆమె మరణవార్త తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. ఆమె ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఆమె గదిలోకి వచ్చి.. ఆమె వస్తువులు.. పుస్తకాలు.. గది మొతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు.. విద్యార్థి సంఘాలు ఈ వ్యవహారంపై ఆందోళన నిర్వహిస్తున్నాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గతంలో తన విదేశీ పర్యటన సందర్భంలోనే నాగార్జున వర్సిటీలో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. మళ్లీ తాజాగా ఆత్మహత్యబాబు విదేశీ పర్యటనలోనే ఉన్నప్పుడు చోటు చేసుకోవటం గమనార్హం.
బాబు విదేశీ పర్యటనకు విద్యార్థినుల ఆత్మహత్యలకు లింకు లేనప్పటికి.. ఇలాంటి సున్నిత అంశాలు బాబు రాష్ట్రంలో లేనప్పుడే చోటు చేసుకుంటున్నాయని చెప్పటమే ఉద్దేశ్యం. ఇలాంటి సమయంలో చురుగ్గా స్పందించాల్సిన అవసరం అధికారపక్షానికి ఉందన్న విషయం మర్చిపోకూడదు. భానుప్రీతి ఆత్మహత్యకు కారణం తెలుసుకొని.. అందుకు కారణమైన వారి విషయంలో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు.. అసలీ ఘోరం ఎలా జరిగిందన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.