Begin typing your search above and press return to search.
తండ్రి గన్ తో మరో విద్యార్థి సూసైడ్
By: Tupaki Desk | 30 April 2019 6:36 AM GMTమరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. చదువే జీవితం కాదన్న విషయం మీద పెద్దలు.. పిల్లలు అవగాహన రావాల్సింది పోయి.. పాస్.. ఫెయిల్ మీదనే ఫోకస్ మొత్తాన్ని పెడుతున్న వైనం ఇప్పుడు విషాద ఉదంతాలకు కారణంగా మారుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని నేరెడ్ మెట్ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి సోహెల్. ఇతడి తండ్రి రిటైర్డ్ జవాన్ గా పని చేశాడు.
ఇటీవల విడుదలైన ఇంటర్ లో ఇతను ఫెయిల్ కావటంతో తండ్రి తీవ్రంగా మందలించాడు. దీంతో.. తీవ్ర ఒత్తిడికి సోహైల్ గురైనట్లు చెబుతున్నారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్ లో ఐఐటీ కోసం కోచింగ్ తీసుకుంటున్న సోహెల్.. తాజాగా తనకు ర్యాంకు వస్తుందో రాదో అన్న భయంతో.. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత తన తండ్రి తుపాకీతో నుదిటి మీద కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఐఐటీ రిజల్ట్ నేపథ్యంలో.. తనకు అనుకున్న ర్యాంక్ రాదన్న భయాందోళనలతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో.. విద్యార్థి తల్లిదండ్రుల శోకం చూపరుల్ని కదిలించి వేస్తోంది. పరీక్షల్లో ఫెయిల్ జీవితంలో ఓడిపోయినట్లు కాదన్న విషయాన్ని ప్రముఖులు అదే పనిగా చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం ప్రాణాలు తీసుకోవటం ఆపని పరిస్థితి.
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో లోపాలు చేసుకోవటం కారణంగా.. పలువురు ఫెయిల్ అయినట్లుగా ఫలితాలు వచ్చాయి. దీంతో.. ఆందోళనకు గురైన విద్యార్థులు పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. సోహైల్ ఉదంతంలోపోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.