Begin typing your search above and press return to search.

జగన్ సమక్షంలో చిన జీయర్ స్వామి ఆసక్తికర కామెంట్స్...?

By:  Tupaki Desk   |   7 Feb 2022 6:13 PM GMT
జగన్ సమక్షంలో చిన జీయర్ స్వామి ఆసక్తికర కామెంట్స్...?
X
హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో శ్రీ రామానుజుల స్వామి వారి అతి పెద్ద విగ్రహం సమతామూర్తిగా ఆవిష్కరింపచేసిన ఘనత అచ్చంగా చిన జీయర్ స్వామిదే. ఆయన దృఢ సంకల్పమే ఈ రోజు 216 అడుగుల సమతామూర్తిని భారత జాతి ముందు నిలబెట్టింది. ఇక సమతామూర్తిని జగన్ తాజాగా సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ జీ అంటూ ఆప్యాయంగా చినజీయర్ సంభోదిస్తూ ఆయన్ని పక్కన పెట్టుకుని మరీ సభలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

చదువు, వయసు, డబ్బు, అధికారం ఈ నాలుగు ఎవరికైనా చాలా ముఖ్యమైనవి అని స్వామీజీ చెప్పారు. అంతే కాదు, ఈ నాలుగూ కూడా ఎవరికీ సొంతంగా దక్కవు, రావు, వాటిని తీసుకోవడానికి ఎవరో ఒకరి సహకారం ఉండాల్సిందే అన్నారు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది నా గొప్పే అనుకోవడం మానవ సహ‌జంగా జరుగుతుంది అన్నారు.

అయితే జగన్ విషయం తీసుకుంటే ఆయనకు డబ్బు, చదువుతో పాటు వయసు ఉన్నాయి. ఇపుడు శక్తివంతమైన అధికారం కూడా దఖలు పడింది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అత్యంత శక్తిమంతుడు. మరి నాలుగూ ఒకరికే ఉంటే నిజంగా అహంకారం హెచ్చుగానే ఉంటుంది.

కానీ జగన్ లో అవి లేకపోవడం విశేషమని స్వామి అన్నారు. అదే విధంగా జగన్ సమతావాదాన్ని నమ్ముతూ పాలన సాగించాలని చినజీయర్ స్వామి హితవు పలికారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అందరూ ఒకటే అన్న భావనతో రాజధర్మాన్ని నెరవేర్చాలని చిన జీయర్ అనడం విశేషం. పెద్దల సూచనలు పాటిస్తూ రాజ్య పాలన చేయాలని కూడా జగన్ని కోరారు.

మొత్తానికి సమతామూర్తిని దర్శించుకోవడానికి వచ్చిన జగన్ కి స్వామిజీ చక్కని సందేశం ఇచ్చారు. మరింతగా అభివృద్ధి చెందాలని కోరుతూ మంగళశాసనం చేశారు. జగన్ ని ఈ సందర్భంగా యంగ్ బాయ్ అని సంభోదిస్తూ స్వామి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, చినజీయర్ స్వామి మొత్తం ప్రసంగంలో రాజధర్మం గురించి చెప్పిన మాటలు ఏలికలు అందరికీ స్పూర్తిదాయమనే చెప్పాలి.