Begin typing your search above and press return to search.

ఓసీల కోటలో బీసీ మహిళ చరిత్ర

By:  Tupaki Desk   |   6 Jun 2019 11:20 AM GMT
ఓసీల కోటలో బీసీ మహిళ చరిత్ర
X
ప్రత్తిపాటి పుల్లారావు.. రాజకీయ దిగ్గజం.. టీడీపీ సీనియర్ నేత - మంత్రి.. అలాంటి దిగ్గజాన్ని ఓడించాలంటే గండరగండరలు కావాలనుకుంటున్నారా.? కానీ కానే కాదు.. ఒక మహిళ.. అదీ బీసీ సామాజికవర్గానికి చెందిన సాదాసీదా మహిళ ఆ పని చేసి చూపించింది.

వైసీపీ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ అగ్రనేతల్లో పత్తిపాటి ఒకరు.. వైఎస్ జగన్ ప్రభంజనంలో ఓసీల కోటలో బీసీ గెలవడం విశేషం. కోట్ల రూపాయల ఆస్తి ఉండి.. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మహిళ రాజకీయాలపై ఆసక్తి - ప్రజా సేవ చేయడానికి వచ్చి వైసీపీ టికెట్ పొంది పోటీ చేసింది. దిగ్గజ ప్రతిపాటిని చిత్తుగా ఓడించింది. వైసీపీ హోరులో ఇలాంటి మహిళలు ఎందరో చట్టసభకు వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు..

చిలకలూరిపేట అసెంబ్లీలో ఆదినుంచి ఓసీలదే రాజ్యం.. ఇక్కడ ఎమ్మెల్యేలుగా అగ్రవర్ణాలే గెలిచారు. కానీ తొలిసారి బీసీ మహిళ విడదల రజినీ వైసీపీ నుంచి పోటీచేసి గెలవడం విశేషం. చిలకలూరిపేటలో వీఆర్ ఫౌండేషన్ అనే సేవాసంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన ఈమెకు జగన్ టికెట్ ఇచ్చారు. బలమైన ప్రతిపాటిని ఓడించారు. చిలకలూరిపేట చరిత్రలోనే బీసీ ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు.

ఈమె భర్త కుమారస్వామి అమెరికాలో ప్రాసెస్ వీవర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. రజినీ దంపతులకు ఒక కుమారుడు - కుమార్తె. హైదరాబాద్ మల్కాజిగిరిలో డిగ్రీ చదివిన ఈమె మైసూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి రాజకీయాలపై ఆశతో ప్రజాసేవ చేయడానికి వచ్చి అనూహ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచారు.