Begin typing your search above and press return to search.
హెచ్.పి.ఎస్. టు మైక్రోసాఫ్ట్ సీఈఓ..
By: Tupaki Desk | 19 Aug 2016 5:45 AM GMTఈ రోజు ఆగస్టు 19.. ఈ రోజున చాలా చాలా గొప్ప సంగతులు జరిగే ఉంటాయి, ఎంతో మంది గొప్పగొప్పవారు జన్మించే ఉంటారు. ఇదేరోజున మైక్రోసాఫ్ట్ సీఈఓ గా పనిచేస్తున్న తొలి అమెరికేతరుడిగా గుర్తింపు పొందిన తెలుగువాడు - సత్య నాదెళ్ల పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూలు నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓ వరకూ వెళ్లిన ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. ఆయనకు సంబందించిన వ్యక్తిగతమైన - ఆసక్తికరమైన సంగతులను తెలుసుకుందాం.
1967 ఆగస్టు 19న హైదరాబాద్ లో జన్మించిన సత్య నాదెళ్ల హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నారు. అనంతరం ఎలాక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ ను మనిపాల్ యూనివర్సిటీ నుంచి చేశారు. అలా గ్య్రాడ్యుయేషన్ పూర్తయ్యిందో లేదో.. 1988లో అమెరికాకు వెళ్లిన నాదెళ్ల.. విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు. ఈ రకంగా అమెరికాలో రెండు మాస్టర్ డిగ్రీలు పూర్తిచేసిన సత్య నాదెళ్ల.. తన చిననాటి స్నేహితురాలు - స్కూల్ మేట్ అయిన అనుపమను 1992లో వివాహం చేసుకున్నారు. అదృష్టం ఆమెరూపంలో వచ్చిందో లేక అదృష్టం - భార్యా ఆ ఏడాది కలిసి వచ్చాయో కానీ... మైక్రోసాఫ్ట్ తో నాదెళ్లకు ఆ ఏడాదిలోనే పరిచయం ఏర్పడింది. అంటే.. ఆ ఏడాదిలోనే సత్య నాదెళ్ల ఒక సాదారణ ఉద్యోగిగా మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరారు.
ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ లో బింగ్ విభాగానికి చాలాకాలం సేవలు అందించిన ఆయన.. బింగ్ బ్రౌజర్ కు అద్భుతమైన ఆదరణ లభించేలా జనాల్లోకి తీసుకెళ్లారు. డేటాబేస్ - డెవలపర్ టూల్స్ - విండోస్ సర్వర్ - క్లౌడ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన నాదెళ్ల... క్లౌడ్ వర్షన్ ఆఫీస్ 365 తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇలా మెట్టు మెట్టు ఎక్కుతూ సాదారణ ఉద్యోగిగా చేరిన మైక్రోసాఫ్ట్ కే సీఈఓ అయిపోయారు.. కృషి ఉంటే మామూలు ఉద్యోగులు సైతం సీఈఓలు అవుతారని నిరూపించారు. మిగితా భారతీయుల్లాగే క్రికెట్ అంటే పిచ్చి ఉన్న సత్య నాదెళ్ల ఏమాత్రం అవకాశం దొరికినా మ్యాచ్ చూడటానికి ప్రయత్నం చేస్తుంటారట. ఇదే సమయంలో కవితలను కూడా బాగా ఎంజాయ్ చేసే ఈయన ప్రస్తుతం తాను రాస్తున్న "హిట్ రిఫ్రెష్" పుస్తకంపై పనిచేస్తున్నారు. సత్య నాదెళ్ల ఎప్పుడూ బిల్ గేట్సే తన మార్గదర్శకుడు అని చెప్తుంటారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. జన్మదిన శుభాకాంక్షలు!