Begin typing your search above and press return to search.
మోడీ చేసిన పనితో విజయసాయి రెడ్డి గ్రాఫ్ ఒక్కసారి పెరిగింది
By: Tupaki Desk | 20 Jun 2019 4:54 AM GMTఆయన ఏకంగా దేశ ప్రధాని. అందులోకి నరేంద్రమోడీ. ఆయన కంట్లో పడాలని తపించే నేతలు ఎందరో. అలాంటి ఆయన వేగంగా నడుస్తూ వెళుతున్న ఆయన ఒకరిని చూసి ఆగారు.. వెంటనే పేరు పెట్టి పిలవటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరంటారా? రాజ్యసభ సభ్యుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి.
జమిలి ఎన్నికల విషయంపై పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మోడీ వేగంగా వెళుతున్నారు. ఆయనతో పాటు అమిత్ షా పలువురు నేతలు.. అధికారులు ఉన్నారు. ఇలాంటి వేళ.. వెళుతున్న మోడీ ఒక్కసారిగా ఆగారు. విజయ్ గారూ అంటూ పిలిచారు. అక్కడే ఉన్న విజయసాయి రెడ్డి ఒక్కసారిగా మోడీ వద్దకు వచ్చారు. ఆయనతో కరచాలనం చేసి నమస్కరించారు.
ఆయన్ను ప్రత్యేకంగా పలుకరించి వెళ్లటం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాని స్థాయి నేత విజయసాయి రెడ్డి ని చూసినంతనే ఆగి మరీ పలుకరించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అక్కడ విజయసాయి రెడ్డి ఎందుకు ఉన్నారన్నది చూస్తే.. అఖిలపక్ష సమావేశానికి పార్టీ అధ్యక్షులకు తప్పించి మిగిలిన వారికి ఎంట్రీ లేకపోవటంతో సమావేశంలో ఉన్న తమ వారి కోసం పలు పార్టీలకు చెందిన ముఖ్యులు వెయిట్ చేస్తున్నారు.
అలా అక్కడ ఉన్న వారిలో ఎవరికి దక్కని గౌరవం విజయసాయిరెడ్డి కి దక్కటం గమనార్హం. తాజా పరిణామంతో విజయసాయి రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలను పలుకరించారు.
ఇక.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తనను తాను పరిచయం చేసుకోవటం విశేషం. బొకేలు పట్టుకొని కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసే నాటి ఏపీ అధికారపక్షానికి భిన్నంగా నేటి ముఖ్యమంత్రిని కేంద్రమంత్రులే తమను తాము పరిచయం చేసుకోవటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.