Begin typing your search above and press return to search.

సండే నాన్ వెజ్ తింటే క్షేమం కాద‌ట‌

By:  Tupaki Desk   |   19 March 2018 6:46 AM GMT
సండే నాన్ వెజ్ తింటే క్షేమం కాద‌ట‌
X
ఉగాది సంద‌ర్భంగా పంచాంగ శ్ర‌వ‌ణం చేయ‌టం ఆన‌వాయితీగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పంచాంగ శ్ర‌వ‌ణం సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి అయితే.. ఎప్పుడూ లేని రీతిలో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తాజా పంచాంగ శ్ర‌వ‌ణం సంద‌ర్భంగా తెర మీద‌కు వ‌చ్చింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అధికారికంగా ఉగాది వేడుక‌ల్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పంచాంగ శ్ర‌వ‌ణం చేయ‌టానికి శృంగేరి పీఠం అస్థాన పండితుడు బాంచ‌ప‌ల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ ప‌ఠ‌నం చేశారు. ఆయ‌న‌.. ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తూ.. ఆదివారం మాంసాహారాన్ని తినే అల‌వాటుకు ఈ ఏడాది దూరంగా ఉండాలంటూ కొత్త విష‌యాన్ని చెప్పారు.

తాను చెప్పిన మాట‌కు కార‌ణాన్ని వివ‌రిస్తూ.. ఈ ఏడాది రాజు స్థానంలో సూర్యుడు ఉన్నందున‌.. ఆయ‌న‌కు ప్రీతిపాత్ర‌మైన రోజు ఆదివారం కావ‌టంతో ఆ రోజు మాంస‌భ‌క్ష‌ణ క్షేమ‌క‌రం కాద‌ని చెప్పారు.సండే నాన్ వెజ్ వ‌ద్ద‌ని.. ఇది తాను రాష్ట్ర ప్ర‌జ‌ల మంచి కోసం చెబుతున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

కుజుడు సంచ‌రించే స్థితి కార‌ణంగా ఇళ్ల‌ల్లో గొడ‌వ‌లు బాగా పెరుగుతాయ‌ని.. దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఎక్కువై విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంద‌న్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునే వారు తొంద‌ర‌పాటు వ‌ద్ద‌ని.. అన్ని ఆలోచించిన త‌ర్వాతే పెళ్లి చేసుకోవాల‌న్నారు.

ఇక‌.. ఈ ఏడాది సైన్యాధిప‌తి శుక్రుడు కావ‌టంతో మ‌హిళ‌లు కీ రోల్ ప్లే చేస్తార‌న్నారు. పాల‌న‌లోనే కాదు.. ఇంట్లోనూ మ‌హిళ‌ల అధిప‌త్యం క‌నిపిస్తుంద‌న్నారు. మొత్తంగా ఈ ఏడాది స్త్రీ నామ సంవ‌త్స‌రంగా బాచంప‌ల్లి అభివ‌ర్ణించారు. దీని..ప‌రామ‌ర్థం ఏమిటి అధ్య‌క్షా?