Begin typing your search above and press return to search.
పిల్లల కరోనా వ్యాక్సిన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్
By: Tupaki Desk | 22 Feb 2022 8:30 AM GMTకరోనా మహమ్మారి కట్టడి చేయడంలో వ్యాక్సిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక మంది వైద్య నిపుణులు ధ్రువీకరించారు. అంతేకాకుండా మొదటి రెండు వేవ్ ల్లో వైరస్ కారణంగా ఎంతో మంది బలయ్యారు. సెకండ్ వేవ్ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.
వివిధ రకాల వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో జోరుగా టీకా పంపిణీ జరిగింది. ఫలితంగా మరణాల రేటును చాలా వరకు తగ్గింది. అయితే పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు ఇప్పటికీ ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన పిల్లలకు టీకాకు అనుమతి లభించాయి.
కార్బెవాక్స్ టీకాను 12-18 ఏళ్ల పిల్లలకు ఇవ్వవచ్చునని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ధ్రువీకరించిందని ఆ కంపెనీ వెల్లడించింది. ఆ వయసు గల పిల్లలకు అత్యవసర వినియోగానికి సోమవారం అనుమతులు వచ్చాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ -ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా తెలిపారు.
పెద్దలకు ఇవ్వడానికి ఈ టీకాకు గతేడాది డిసెంబర్ లో అత్యవసర అనుమతులు లభించాయి. అనంతరం రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఫేజ్2,3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా ఈ టీకాను పిల్లలకు ఇవ్వడానికి అత్యవసర అనుమతులు లభించాయని కంపెనీ ఎండీ తెలిపారు.
కార్బెవాక్స్ టీకాను ఇంజక్షన్ ద్వారా ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత సెకండ్ డోసు తీసుకోవాలి. ఇకపోతే పిల్లలకు టీకా కోసం ఇప్పటికే చాలా కంపెనీలు ప్రయోగాలు జరుపుతోంది. అమెరికా వంటి దేశాల్లోనూ ఈ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చిన్నారులకు టీకా వస్తే మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయగలమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్బెవాక్స్ టీకాను 12-18 ఏళ్ల పిల్లలకు ఇవ్వడానికి డీసీజీఐ పచ్చజెండా ఊపింది.
కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. గతేడాది చివర్లో, ఈ ఏడాది ప్రారంభంలో వైరస్ విజృంభించింది. థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరించారు. అయితే వ్యాక్సిన్ పుణ్యమా? అని అంత ప్రమాదకర పరిస్థితులు రాలేదని చెప్పవచ్చు. చాలామంది రెండు డోసుల టీకాను తీసుకోవడం... కనీసం ఒక్క మోతాదు తీసుకున్నా కూడా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.