Begin typing your search above and press return to search.

నయిం డైర్ ఓపెన్.. లిస్ట్ తో కొత్త కలకలం

By:  Tupaki Desk   |   1 Aug 2019 10:27 AM GMT
నయిం డైర్ ఓపెన్..  లిస్ట్ తో కొత్త కలకలం
X
పోలీస్.. రాజకీయనాయకులు.. ఇలా ఎవరినైనా సరే డోన్ట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించిన గ్యాంగ్ స్టర్ నయాం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ముఖ్యమైన వాటిల్లో ఆయన డైరీ ఒకటి. ఇందులో పలు సంచలన విషయాలు ఉన్నట్లుగా ఇప్పటికే కథనాలు వచ్చాయి. తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నయిం కేసుకు సంబంధించిన వివరాల్ని పోలీసు అధికారుల్ని కోరింది.

అనూహ్యంగా ఈ విన్నపాన్ని ఓకే చేసిన అధికారులు సమాచారహక్కు చట్టం కింద పలు వివరాల్ని వెల్లడించారు. నయిం కేసులో భాగస్వామ్యం కావటంతో పాటు.. ఆయన చేసిన నేరాల్లో సంబంధం ఉందని భావిస్తున్న పలువురు పేర్లు బయటకు వచ్చి ఇప్పుడుసంచలనంగా మారింది. ఈ పేర్లలో పలువురు టీఆర్ ఎస్ నాయకులు ఉండటం షాకింగ్ గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పుడు పేర్లు బయటకు వచ్చిన టీఆర్ ఎస్ నేతల్లో పలువురు గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం.

నయిం మరణించిన తర్వాత నమోదైన కేసులు 250 కాగా.. పెద్ద ఎత్తున క్యాష్ తో పాటు బంగారం.. వెండి ఆభరణాల్ని సీజ్ చేసినట్లు చెప్పారు. అప్పట్లో డబ్బును లెక్కించటానికి బ్యాంకుల నుంచి మెషీన్లు తీసుకెళ్లిన వైనం మర్చిపోలేం. అయితే.. అలా లెక్కించిన మొత్తం కేవలం రూ.2 కోట్లే కావటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. నయిం వ్యవహారాల్లో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు.. నేతల పేర్లు చూస్తే..

% అడిషనల్‌ ఎస్పీలు శ్రీనివాసరావు- చంద్రశేఖర్‌- అమరేందర్‌ రెడ్డి

% డీఎస్పీలు శ్రీనివాస్‌- సాయిమనోహర్‌రావు- శ్రీనివాసరావు- ప్రకాశ్‌ రావు, వెంకటనర్సయ్య

% పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న

% ఇన్‌ స్పెక్టర్లు మస్తాన్‌- శ్రీనివాసరావు- మాజీద్‌- వెంకటరెడ్డి- వెంకట సూర్యప్రకాశ్‌- రవికిరణ్‌ రెడ్డి- బల్వంతయ్య- బాలయ్య- రవీందర్‌- నరేంద్రగౌడ్‌- దినేశ్‌- సాదిఖ్‌ మియా టీఆర్‌ ఎస్‌ నేతలు

% భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌

% మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌

% మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌

% మాజీ ఎంపీపీలు నాగరాజు.. వెంకటేశ్‌..

% వెల్దండ టీఆర్‌ ఎస్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వరయ్య
మాజీ సర్పంచ్‌ పింగల్‌ రెడ్డి- మాజీ ఎంపీటీసీ సంజీవ్‌