Begin typing your search above and press return to search.
మన దేవుళ్లపై ఇంటర్నేషనల్ ఛానళ్ల కన్ను
By: Tupaki Desk | 30 March 2017 7:16 AM GMTరెండు రోజల కిందట నేషనల్ జాగ్రఫీ ఛానల్ తిరుమల ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. నెలల తరబడి షూట్ చేసిన ఆ కార్యక్రమంపై ప్రసారానికి ముందునుంచే భారీగా ప్రచారం కూడా చేసింది. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అంటే ఏ ప్రోగ్రాం చేసినా కూడా దానికి పరిపూర్ణత్వం ఉంటుందని... క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని పేరు... దాంతో ఆ కార్యక్రమం ప్రసారమైన రోజున ప్రజలు రాత్రి 9 గంటల కంటే ముందు నుంచే టీవీల ముందు సిద్ధమైపోయారు.
ఎన్నడూ నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ చూడనివారు కూడా ఆ రోజు చూశారు.. ఇంట్లో ఎవరైనా ఆ ఛానల్ చూస్తుంటే రిమోట్ తీసుకుని మార్చేసే అలవాటున్నవారు కూడా తిరుమల వెంకన్నపై ఆ ఛానల్ చేసిన ప్రోగ్రాంను చూశారు. తిరుమల వెంకన్నపై ప్రోగ్రాం చేయడం వల్ల భారత్ లో... ముఖ్యంగా దక్షిణాదిలో ఆ ఛానల్ వ్యూయర్ షిప్ ఆ రోజు అమాంతం పెరిగిపోయింది. అమెరికాకు చెందిన ఈ ఇంటర్నేషనల్ ఛానల్ మార్గంలోనే మరో ఇంటర్నేషనల్ చానల్ కూడా నడుస్తోంది. సింహాచలం అప్పన్నపై ప్రత్యేక కార్యక్రమం రూపొందించడానికి సిద్ధమవుతోంది... త్వరలో తెలుగులో అడుగుపెట్టనున్న బీబీసీ ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసింది.
శ్రీమహావిష్ణువు వరాహ, నారసింహ అవతారాల కలయికలో విలక్షణ మూర్తిగా ఆవిర్భవించిన మహా పుణ్యక్షేత్రం సింహాచలం. దేశంలో నారసింహ క్షేత్రాలు, వరాహ క్షేత్రాలు అనేకం ఉన్నా వరాహ నారసింహ అవతారాలు కలిసి ద్వాయావతారంలో వెలసిన విశిష్ఠ రూపుడు సింహాచలేశుడు. ప్రపంచంలో మరెక్కడా కానరాని ఈ అరుదైన నారసింహుడి అవతార క్షేత్ర విశిష్ఠతలపై డాక్యుమెంటరీ చిత్రీకరించేందుకు బిబిసి చానల్ ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఉగాది రోజున పని మొదలుపెట్టారు. బుధవారం దేవాలయంలో జరిగిన పందిరిరాట ఉత్సవాన్ని చిత్రీకరించారు. దేవాలయంపై కొలువుతీరివున్న శిల్పాలను, ఏకశిలా స్తంభాలను తమ వద్ద ఉన్న అరుదైన కెమెరాలతో చిత్రీకరించారు. ఆలయ విశిష్టతలు, ఉత్సవాలు, భక్తుల సదుపాయాలను కూడా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా తిరుమల, సింహాచలం వంటి ఆలయాలు ప్రశస్తమైనవి కావడంతో దేశవిదేశాల్లో భక్తులు ఉండడం వల్ల అంతర్జాతీయ ఛానళ్లు వీటిపై దృష్టిపెడుతున్నాయి. పైగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆలయాలకు ప్రాధాన్యం దక్కడం.. ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలపడిన నేపథ్యంలో ఆధ్యాత్మిక ప్రోగ్రాంలకు వ్యూయర్ షిప్ ఉంటుందన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఛానళ్ల మన ఆలయాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/