Begin typing your search above and press return to search.
మోడీ పరువు తీస్తున్న అంతర్జాతీయ మీడియా
By: Tupaki Desk | 25 April 2021 12:00 PM ISTయాథా నిర్లక్ష్యం.. తథా శాపనార్థం అన్నట్టు మనం చేసిన తప్పులే మనకు చుట్టుకుంటాయని నానుడి. ఒకప్పుడు మోడీని వేయినోళ్లతో పొగిడిన అంతర్జాతీయ మీడియా ఇప్పుడు అదే మోడీ చేసిన తప్పులను ఎండగడుతూ కథనాలు రాస్తూ ఆయన పరువును తీస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ లో దేశంలో లాక్ డౌన్ పెట్టి కంట్రోల్ మోడీ హీరో అయ్యాడని అంతర్జాతీయ మీడియా కొనియాడింది. కానీ రెండో వేవ్ కు వచ్చేసరికి మోడీ పాలన సామర్థ్యం తేలిపోయిందని విమర్శిస్తున్నాయి.
భారత్ లో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. లక్షల కేసులు.. వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అంతర్జాతీయంగా భారత్ లోని కల్లోల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్ లోని మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా అంతర్జాతీయ మీడియా మండిపడుతోంది. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో దేశంలో ఎన్నికలు పెట్టి రాజకీయ ప్రచారం చేయడం.. మహా కుంభమేళాలకు అనుమతులు ఇవ్వడం ఏంటని మోడీ సర్కార్ ను అంతర్జాతీయ మీడియా కడిగేస్తోంది. దీని వల్లే భారత్ లో కరోనా కోరలు చాస్తోందని అభిప్రాయపడుతున్నాయి.
కరోనా నరకంలోకి ఇండియా పడిపోతోందని ప్రముఖ దినపత్రిక గార్డియన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక కరోనా భారత్ ను అమెరికా ప్రభుత్వం ఆదుకోవాలని వాషింగ్టన్ పోస్టు సంపాదకీయంలో కోరింది.
ఇలా అంతర్జాతీయంగా ఒకప్పుడు హీరోగా వెలిగిన మోడీ.. ఇప్పుడు కరోనా కాలంలో చేసిన తప్పులతో విలన్ గా మారిపోయారు. పొగిడిన నోళ్లే తిడుతున్న పరిస్థితి దాపురించింది.