Begin typing your search above and press return to search.

అంతర్జాతయ పురుషుల దినోత్సవం: ఈ మగాళ్లు మంచోళ్లే..

By:  Tupaki Desk   |   19 Nov 2022 11:36 AM GMT
అంతర్జాతయ పురుషుల దినోత్సవం: ఈ మగాళ్లు మంచోళ్లే..
X
మహిళా దినోత్సవం వస్తే చాలు మహిళల గురించి గొప్పగా చెబుతూ వారి గురించి మీడియా, పత్రికాల్లో ఊదరగొడుతుంటారు. సభలు, సమావేశాలు పెట్టి మరీ హడావుడి చేస్తారు. సాధించిన మహిళలను సన్మానిస్తారు. కానీ పురుషుల దినోత్సవాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. దానికి అంత విలువ ఉండదు. ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా మగవాళ్లలో సాధించిన వారిని గుర్తు చేసుకుంటున్నారు. మగవాళ్ల ఆరోగ్యం, సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు.

యూనెస్కో సహకారంతో కొన్ని దేశాల్లో కొన్ని దేశాల్లోని ఎన్జీవోలు, మరికొన్ని దేశాల్లో ఏకంగా ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డేను నిర్వహిస్తున్నాయి. మహిళల కోసం ఒక రోజు ఉండటం మూలానా మనుషులంతా సమానమే అనే సిద్ధాంతాన్ని దెబ్బతీసినట్టైంది. దీంతో మగాళ్లకు ఒకరోజు నిర్వహించడం ద్వారా సమతుల్యత తేవాలని కొందరు మేధావులు భావించారు.

అమెరికా కన్సాస్ లోని మిస్సోరి యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్, సమాజానికి మగవాళ్లు చేస్తున్న సేవలను అభినందించేందుకు ఒక రోజు అవసరం అని భావించారు. చివరకు ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా 1992, ఫిబ్రవరి 7న ఇంటర్నేషనల్ మెన్స్ డే నిర్వహించారు.

1999లో ఐక్యరాజ్యసమితి ట్రినిడాడ్ టొబాగో దేశంలో మగవాళ్ల కోసం ఉద్యమించిన తిలక్ సింగ్ గుర్తుగా నవంబర్ 19వ తేదీన 'మెన్స్ డే' నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది. దాదాపు 80కి పైగా దేశాలు ఇప్పుడు మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. ఆ లిస్ట్ లో మన దేశం కూడా ఉంది. కానీ మన దేశంలో ఈ దినోత్సవానికి ప్రచారం మొదలుపెట్టింది ఒక మహిళ కావడం గమనార్హం.

మన దేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఉద్యమవేత్త, పురుషుల తరుఫున వాదించే న్యాయవాది 'ఉమా చల్లా' విస్తృత ప్రచారం కల్పించారు. 2007 నుంచి ఆమె ఈ ప్రయత్నంలో ఉన్నారు. మహిళా పక్షపాత ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో మగవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపులు, హింసను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పురుష వ్యతిరేక న్యాయవ్యవస్థ అనే చట్రంలో మగవాళ్లకు న్యాయం చేసే అనితర బాధ్యతను మోస్తున్నారు. 2001 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఒక్కో ఏడాదికి ఒక్కో నేపథ్యంలో నిర్వహిస్తున్నారు. హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్ థీమ్ ను ఈ ఏడాదికి ప్రకటించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.