Begin typing your search above and press return to search.

నవ్యాంధ్ర నుంచి నేరుగా విదేశాలకు

By:  Tupaki Desk   |   18 Aug 2015 12:38 PM GMT
నవ్యాంధ్ర నుంచి నేరుగా విదేశాలకు
X
నవ్యాంధ్ర నుంచి విదేశాలకు వెళ్లాలంటే నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లోని శంషాబాద్ లేదా చెన్నై విమానాశ్రయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచే విదేశాలకు చెక్కేస్తున్నారు. రోజుకు సగటున 400 నుంచి 500 మంది గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళుతున్నారని అంచనా.

కృష్ణా - గుంటూరు - ప్రకాశం - ఉభయ గోదావరి జిల్లాలకు గన్నవరం విమానాశ్రయం దగ్గర్లో ఉన్న విషయం తెలిసిందే. విశాఖ సహా ఉత్తరాంధ్రకు విశాఖ విమానాశ్రయం ఉంటే.. నెల్లూరు సహా రాయలసీమకు తిరుపతి - చెన్నై- బెంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ, కోస్తాంధ్ర మధ్యలో ఉన్న ఈ జిల్లాల ప్రజలు మాత్రం అటు చెన్నైనో ఇటు హైదరాబాదో రావాల్సి వచ్చేది. కానీ గన్నవరం విమానాశ్రయం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో వారికి ఇబ్బంది తప్పింది. జాతీయ రహదారి ఐదు నుంచి నేరుగా గన్నవరానికి వస్తున్నారు. అక్కడ విమానం ఎక్కడి విదేశాల్లో దిగుతున్నారు. ఈ విమానాశ్రమయం నుంచి ప్రతిరోజూ వెయ్యి నుంచి 1200 మంది ప్రయాణిస్తుండగా వారిలో 400 నుంచి 500 మంది విదేశాలకు వెళుతున్నారట.

గన్నవరం నుంచి ప్రయాణికులు ఎక్కడెక్కడికి వెళుతున్నారన్న దానిపై గవన్నవరం విమానాశ్రయం అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ క్యాప్ కూడా సర్వే చేసింది. గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా, ఎయిర్ కోస్టా, స్పైస్ జెట్ తదితరాల నుంచి వివరాలు సేకరించారు. సగం మంది విదేశాలకు వెళుతున్నట్లు తేలింది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళుతున్నట్లు తేలింది. ఉభయ గోదావరి, ప్రకాశం నుంచి సింగపూర్, మలేసియా, హాంకాంగ్, చైనా తదితర దేశాలతోపాటు గల్ఫ్ దేశాలకు వెళుతున్నట్లు తేలింది.