Begin typing your search above and press return to search.
చిత్తూరు పోలీసులకు రెడ్ శాండిల్ క్వీన్ షాక్
By: Tupaki Desk | 20 Jun 2016 4:06 PM GMTపట్టువదలని విక్రమార్కుడి మాదిరి వ్యవహరిస్తున్న చిత్తూరు పోలీసులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో మాఫియా క్వీన్ గా చెబుతున్న మోడల్ కమ్ యాక్టర్ సంగీతా చటర్జీని అరెస్ట్ చేయటానికి విపరీతంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కోల్ కతాలో ఆమె అడ్రస్ పట్టుకొని.. ఆమెను అదుపులోకి తీసుకున్నప్పటికి.. తన పలుకుబడితో గంటల వ్యవధిలో బెయిల్ పొందిన ఆమె వైనం ఏపీ పోలీసులకు షాకింగ్ మారిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఆమెకు చెందిన బ్యాంక్ లాకర్లను తెరిచి.. బంగారు నగలు.. కీలక డాక్యుమెంట్లతో పాటు.. ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్న చిత్తూరు పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని ఏపీకి తీసుకురావాలని విపరీతంగా ప్రయత్నించారు. ఇప్పటికే కోల్ కతా కోర్టులో రెండుసార్లు బెయిల్ పొంది తప్పించుకున్న ఆమెను.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా అదుపులోకి తీసుకోవాలని చిత్తూరు జిల్లా పోలీసులు ప్రయత్నించారు.
ఇందు తగ్గట్లే ఆమెను అదుపులోకి తీసుకునేలా డాక్యుమెంట్లు సమర్పించినట్లుగా చెబుతున్నారు. ఒకదశలో సంగీతను ఈసారి తమ అదుపులోకి తీసుకున్నట్లేనని చిత్తూరు పోలీసులు భావించారని తెలిసింది. అయితే.. వారి అంచనాలకు భిన్నంగా తనదైన శైలిలో చక్రం తిప్పిన ఆమె.. మూడోసారి బెయిల్ పొందినట్లుగా చెబుతున్నారు. తాజాగా.. ఆమెకు మరోసారి బెయిల్ మంజూరు కావటంపై ఏపీ పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే.. సంగీతా చటర్జీ సామాన్యురాలిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.